AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: శునకం పాలు తాగున్న చిలుకమ్మ.. షాకింగ్ వీడియో మీకోసం..

Viral Video: కాస్త విభిన్నంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది వెంటనే వైరల్ అవుతుంటుంది.

Viral Video: శునకం పాలు తాగున్న చిలుకమ్మ.. షాకింగ్ వీడియో మీకోసం..
Parrot
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 9:50 PM

Viral Video: కాస్త విభిన్నంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది వెంటనే వైరల్ అవుతుంటుంది. వాటిని చూడగానే.. ఎంతో ఆసక్తికరంగా, విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని వీడియోను చూడటానికి ఏమాత్రం నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దానికి తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? అందులో ఉన్న వింత ఏంటో ఇప్పుడు చూద్దాం..

కలికాలం అంటే ఇదేనేమో మరీ.. అన్నీ వింతలు- విశేషాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ వింత సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ చిట్టి చిలకమ్మ.. ఏకంగా శునకం పాలు తాగుతోంది. ఆ కుక్క కూడా తన పిల్లల మాదిరిగానే చిలుకకు పాలు ఇస్తూ.. దాని కడుపు నింపుతోంది. ఈ వీడియోను ఓ నెటిజన్ కూ యాప్‌లో పోస్ట్ చేయగా.. తెగ ట్రోల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క హాయిగా పడుకున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు ఒక చిలుక అక్కడికి చేరుకుని ఎంతో ఆనందంగా కుక్క పాలు తాగడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా ఆ కుక్క లేచి చూసినా, చిలుకకు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా.. పాలు తాగేలా సహకరిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కలికాలం అంటే ఇదేమరీ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Viral Video:

Also read:

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్లను హెచ్చరించిన బీసీసీఐ అధ్యక్షుడు.. ఈడెన్ పిచ్‌‌పై‌ ఏమన్నాడంటే?

Encounter: కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. 60 మంది పాఠశాల పిల్లల్ని కాపాడిన బలగాలు

Sai Pallavi: అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది !! మనసులో మాట బయటపెట్టిన నేచురల్ బ్యూటీ !! వీడియో