Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore : చేపల కోసం వలవేస్తే !! ఏకంగా ఏడగుల !! వీడియో

Nellore : చేపల కోసం వలవేస్తే !! ఏకంగా ఏడగుల !! వీడియో

Phani CH

|

Updated on: Nov 20, 2021 | 7:25 PM

చేపల కోసం వలవేసిన జాలర్లకు షాకింగ్‌ దృశ్యం దర్శనమిచ్చింది. నీళ్లలోంచి బరువుగా వచ్చిన వలను చూసిన మత్స్యకారులు తమ పంట పడిందని సంబరపడ్డారు.

చేపల కోసం వలవేసిన జాలర్లకు షాకింగ్‌ దృశ్యం దర్శనమిచ్చింది. నీళ్లలోంచి బరువుగా వచ్చిన వలను చూసిన మత్స్యకారులు తమ పంట పడిందని సంబరపడ్డారు. కానీ, తీర వలలో పడ్డ జీవిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే, ఆ వలలో పడింది చేపలు కాదు…భారీ కొండచిలువ..జాలర్లు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని పెన్నానది వద్ద చేపలు పట్టే వలలో కొండ చిలువ చిక్కింది. సోమశిల జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేయడంతో పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సంగం వద్ద పెన్నానదిలో మత్స్యకారులు జోరుగా చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ జాలరి విసిరిన వలలో 7 అడుగుల పొడవైన కొండ చిలువ చిక్కుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో

కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో

Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో

CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో

Published on: Nov 20, 2021 07:24 PM