9 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 550 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బౌలర్లపై విరుచుకపడిన ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌ ఎవరంటే?

IPL 2021 ముగిసింది. కానీ, ఆండ్రీ రస్సెల్ తుఫాను ఇన్నింగ్స్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అతడిని చూసి, ఇంగ్లండ్ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ ఉత్సాహం కూడా ప్రత్యర్థికి భారమైంది.

9 సిక్స్‌లు, 5 ఫోర్లు..  550 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బౌలర్లపై విరుచుకపడిన ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌ ఎవరంటే?
Abu Dhabi T10 League
Follow us

|

Updated on: Nov 20, 2021 | 9:58 PM

IPL 2021 ముగిసింది. కానీ, ఆండ్రీ రస్సెల్ తుఫాను ఇన్నింగ్స్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అతడిని చూస్తుంటే ఇంగ్లండ్ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ ఉత్సాహం కూడా ప్రత్యర్థికి భారమైంది. డెక్కన్ గ్లాడియేటర్స్ వర్సెస్ చెన్నై బ్రేవ్స్ జట్టు ముఖాముఖిగా జరిగిన T10 లీగ్‌లో ఈ దృశ్యం కనిపించింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్, టాప్ మూర్స్ డెక్కన్ గ్లాడియేటర్స్ జోడీ బౌండరీల వర్షం కురిపించడంతో చెన్నై బ్రేవ్స్ ఏదశలోనూ కోలుకోలేకపోయింది. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 17 బంతుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో విజయకేతనం ఎగురవేశారు. ఈ సమయంలో ఇద్దరూ కలిసి 14 బంతుల్లో బౌండరీల ద్వారా 74 పరుగులు సాధించారు.

టీ10 లీగ్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. జట్టు ఆరంభం ఫర్వాలేదనిపించినా ఫలితం లేకపోయింది. ఆండ్రీ రస్సెల్, 25 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టామ్ మూర్స్ బీభత్సం చేశారు. ఇద్దరూ తమ ఇన్నింగ్స్‌లో చెరో 17 బంతులు ఆడారు. ఆండ్రీ రస్సెల్ 17 బంతుల్లో 252.94 స్ట్రైక్ రేట్‌తో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. మరోవైపు, టామ్ మూర్స్ 17 బంతుల్లో 276.47 సగటుతో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.

రస్సెల్, మూర్స్ ఇన్నింగ్స్‌లో బౌండరీల వర్షం.. రస్సెల్, మూర్స్ ఇద్దరూ దాదాపు 550 స్ట్రైక్ రేట్ వద్ద 14 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఈ ఇద్దరూ బౌండరీల ద్వారానే పరుగుల సాధించారు. నిజానికి, ఇద్దరూ కలిసి తమ ఇన్నింగ్స్‌లో 9 సిక్స్‌లు, 5 ఫోర్లు సాధించారు. ఈ విధంగా సిక్సర్ల ద్వారా 54 పరుగులు, ఫోర్లతో 20 పరుగులు సాధించారు. వీరిద్దరి కలిపి మొత్తం 74 పరుగులు చేశారు.

Also Read: IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్లను హెచ్చరించిన బీసీసీఐ అధ్యక్షుడు.. ఈడెన్ పిచ్‌‌పై‌ ఏమన్నాడంటే?

IPL 2022: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అందించిన బీసీసీఐ సెక్రటరీ.. ఐపీఎల్ 2022 ఎక్కడ జరగనుందంటే?