AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అందించిన బీసీసీఐ సెక్రటరీ.. ఐపీఎల్ 2022 ఎక్కడ జరగనుందంటే?

BCCI: కరోనా కారణంగా, IPL 2021 రెండో దశ, IPL 2020 సీజన్ యూఏఈలోనే జరిగింది. దీంతో భారత్‌లో ఎప్పుడు జరగుతుందని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

IPL 2022: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అందించిన బీసీసీఐ సెక్రటరీ.. ఐపీఎల్ 2022 ఎక్కడ జరగనుందంటే?
IPL 2022
Venkata Chari
|

Updated on: Nov 20, 2021 | 9:16 PM

Share

IPL 2022: క్రికెట్ ప్రేమికులకు శుక్రవారం శుభవార్త అందింది. వచ్చే ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నాడు. IPL 2021 మొదటి దశ భారతదేశంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసుల కారణంగా, దానిని మధ్యలో ఆపవలసి వచ్చింది. ఆ తరువాత సెప్టెంబర్-అక్టోబర్‌లో UAEలో నిర్వహించారు. ఇంతకుముందు IPL 2020 కూడా UAEలోనే నిర్వహించారు.

IPL 2022 కోసం మెగా వేలం త్వరలో జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి ఎనిమిది జట్లు కాకుండా 10 జట్లు ఈ లీగ్‌లో పాల్గొనబోతున్నాయి. అహ్మదాబాద్, లక్నో వచ్చే సీజన్ నుంచి లీగ్‌లో పాల్గొనే రెండు కొత్త జట్లు. అటువంటి పరిస్థితిలో తదుపరి సీజన్ కోసం తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని జే షా పేర్కొన్నాడు. 10 జట్ల తదుపరి సీజన్ అభిమానులకు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

ఐపీఎల్ 2022 భారత్‌లోనే.. భారత్‌లో టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల సమయంలో అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. దీంతోనే వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా భారతదేశంలోనే జరుగుతుందని భావించారు. ప్రస్తుతం జే షా దానిని ధృవీకరించారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక కార్యక్రమంలో జయ్ షా మాట్లాడుతూ, ‘బీసీసీఐ సెక్రటరీ, ‘చెపాక్‌లో మీరు చెన్నై సూపర్ కింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. అది త్వరలో జరగబోతోంది’ అని అన్నారు. ‘ఐపీఎల్‌ 15వ సీజన్‌ భారత్‌లో జరగనుందని, రెండు కొత్త జట్ల చేరికతో గతంలో కంటే మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని ఆయన అన్నారు. మన ముందుకు మెగా వేలం రాబోతోంది. కొత్త సమీకరణాలను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

ఫైనల్ మ్యాచ్ ప్లాన్ చెప్పిన దోనీ.. అదే ఈవెంట్‌లో, కెప్టెన్ ధోని కనీసం ఒక సీజన్‌కైనా తనకు ఇష్టమైన పసుపు జెర్సీని ధరిస్తానని, అభిమానులు తమ అభిమాన చెపాక్ స్టేడియంలో తన ‘వీడ్కోలు మ్యాచ్’ ఆడటం తప్పకుండా చూస్తారని స్పష్టం చేశాడు. ధోనీ మాట్లాడుతూ, ‘నేను ఎప్పుడూ నా క్రికెట్‌ను ప్లాన్ చేసుకుంటాను. నా చివరి మ్యాచ్ రాంచీలో ఆడాను. వన్డేల్లో చివరి హోమ్ మ్యాచ్ రాంచీలోనే ఆడాను. కాబట్టి నా చివరి టీ20 మ్యాచ్ చెన్నైలో ఉంటుందని ఆశిస్తున్నాను. అది వచ్చే ఏడాది అవుతుందా లేక ఐదేళ్ల తర్వాత ఉంటుందా అనేది తెలియదు.

Also Read: Watch Video: వావ్.. వాట్ ఏ బాల్.. పాములా మెలికలు తిరిగిన బంతి.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్.. వైరలవుతోన్న వీడియో

SMAT 2021: 4 బంతుల్లో 4 వికెట్లు.. యార్కర్లతో ప్రత్యర్ధులకు చుక్కలు.. దుమ్మురేపిన రాహుల్ టీం బౌలర్.!