Watch Video: వావ్.. వాట్ ఏ బాల్.. పాములా మెలికలు తిరిగిన బంతి.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్.. వైరలవుతోన్న వీడియో

Sheffield Shield: షెఫీల్డ్ షీల్డ్‌లో న్యూ సౌత్ వేల్స్‌పై జేమ్స్ ప్యాటిన్సన్ అద్భుతమైన ఇన్-స్వింగ్ యార్కర్‌ను వేశాడు. పాములా తిరిగిన ఈ బంతిని చూసి అంతా ఆశ్యర్యపోయారు.

Watch Video: వావ్.. వాట్ ఏ బాల్.. పాములా మెలికలు తిరిగిన బంతి.. షాకవుతూ పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్.. వైరలవుతోన్న వీడియో
James Pattinson
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 7:25 PM

James Pattinson: ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉన్నప్పుడు పిచ్‌లో గడ్డి పచ్చిగా ఉంటే బౌలర్ స్వింగ్‌‌లతో భయపెడతాడు. దీంతో స్వింగ్‌కి ఎంత పెద్ద బ్యాట్స్ మెన్ అయినా పెవిలియన్ చేరాల్సిందే. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్‌ను విక్టోరియా బౌలర్లు కేవలం 233 పరుగులకే కట్టడి చేసిన సిడ్నీ మ్యాచులో ఇలాంటిదే కనిపించింది. విక్టోరియా తరఫున జేమ్స్ ప్యాటిన్సన్, మాథ్యూ షార్ట్, క్రాన్, జొనాథన్ మెర్లో తలో 2 వికెట్లు తీశారు. న్యూ సౌత్ వేల్స్ తొలి ఇన్నింగ్స్‌లో ఆడటం చాలా కష్టంగా మారింది.

ముఖ్యంగా జేమ్స్ ప్యాటిన్సన్ తన స్వింగ్, వేగంతో బ్యాట్స్‌మెన్‌లను చాలా ఇబ్బంది పెట్టాడు. ప్యాటిన్సన్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే అతని మొదటి బాధితుడు మాత్రం ఆశ్చర్యపోయేలా పెవిలయన్ చేరాడు. విపరీతమైన స్వింగ్ లో ప్రత్యర్థి జట్టు వికెట్ కీపర్ పీటర్ నెవిల్లేను ప్యాటిన్సన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతి చాలా స్వింగ్ అయింది. ఆ బంతిని ఆడడంలో బ్యాట్స్‌మెన్‌ కూడా చాలా కష్టంగా మారింది. ప్యాటిన్సన్ వేసిన ఈ బాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాములా మెలికలు తిరిగిన బంతి.. 42వ ఓవర్ మూడో బంతికి ప్యాటిన్సన్ ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేశాడు. ప్యాటిన్సన్ వేసిన బంతి ఆరో స్టంప్‌పై ఉంది. కానీ, ఆ తర్వాత అది చాలా స్వింగ్ కావడంతో బ్యాట్స్‌మెన్ పీటర్ నెవిల్ మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. ప్యాటిన్సన్ వేసిన ఈ బంతిని చూసి నెవిల్ ఆశ్చర్యపోయాడు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా పాములా తిరిగిన ఈ స్వింగ్‌ ముందు సమాధానం కరవే. కేవలం 1 పరుగు మాత్రమే చేసి నెవిల్ బౌల్డ్ అయ్యాడు. జేమ్స్ ప్యాటిన్సన్ షెఫీల్డ్ షీల్డ్‌లోనే ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఫాస్ట్ బౌలర్ న్యూ సౌత్ వేల్స్‌పై ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. ప్యాటిన్సన్ బంతిని డేనియల్ హ్యూస్ కొట్టాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం అయింది. ఆ తర్వాత ప్యాటిన్సన్ ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.

జేమ్స్ ప్యాటిన్సన్ గత నెలలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్యాటిన్సన్ ఆస్ట్రేలియా తరఫున 21 టెస్టులు, 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్యాటిన్సన్ కెరీర్ పూర్తిగా గాయాలతో నిండి పోయింది. కాబట్టి అతను చాలా ప్రతిభావంతుడైనప్పటికీ, అతను ఆస్ట్రేలియా జట్టులో నిరంతరం ఆడలేకపోయాడు. దీని తర్వాత విక్టోరియా ఫాస్ట్ బౌలర్ కుటుంబంపై దృష్టి పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Also Read: SMAT 2021: 4 బంతుల్లో 4 వికెట్లు.. యార్కర్లతో ప్రత్యర్ధులకు చుక్కలు.. దుమ్మురేపిన రాహుల్ టీం బౌలర్.!

IND VS NZ: నా బౌలింగ్‌లో వేగం లేదు.. టెక్నికల్‌గాను పర్‌ఫెక్షన్‌ లేదు: టీమిండియా ఫాస్ట్ బౌలర్