IND VS NZ: నా బౌలింగ్‌లో వేగం లేదు.. టెక్నికల్‌గాను పర్‌ఫెక్షన్‌ లేదు: టీమిండియా ఫాస్ట్ బౌలర్

Harshal Patel: రాంచీ టీ20లో న్యూజిలాండ్‌ను ఓడించడం ద్వారా భారత్ (India Vs New Zealand, 2nd T20) సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

IND VS NZ: నా బౌలింగ్‌లో వేగం లేదు.. టెక్నికల్‌గాను పర్‌ఫెక్షన్‌ లేదు: టీమిండియా ఫాస్ట్ బౌలర్
Harshal Patel
Follow us

|

Updated on: Nov 20, 2021 | 6:33 PM

Harshal Patel: రాంచీ టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అలాగే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. జైపూర్ తర్వాత రాంచీలో అద్భుత ప్రదర్శన చేసి రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ ఇప్పుడు మూడో టీ20లో కివీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో ఆదివారం కోల్‌కతాకు వెళ్లనుంది. రాంచీ టీ20లో హర్షల్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఈ ఫాస్ట్ బౌలర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. మ్యాచ్ అనంతరం హర్షల్ పటేల్ యాక్షన్‌లో ‘డిస్టర్బ్’ ఉందని అన్నాడు.

తన యాక్షన్ పర్ఫెక్ట్‌గా లేదని రాంచీ టీ20 తర్వాత హర్షల్ పటేల్ స్వయంగా చెప్పాడు. హర్షల్ పటేల్ మాట్లాడుతూ, ‘ఫాస్ట్ బౌలర్‌కు వేగం అవసరం. కానీ, నేను 135 కి.మీ. కంటే వేగంగా బౌలింగ్ చేయలేనని భావించాను. ఎంతో ప్రయత్నిస్తే తర్వాత 140 కి.మీ. వేగం అందుకున్నా. అంతకంటే ఎక్కువగా మాత్రం బౌలింగ్ చేయలేకపోతున్నాను. అయితే, ఇతర విషయాలపై దృష్టి సారించి నా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. బయో మెకానిక్స్ పరంగా నా యాక్షన్ పర్ఫెక్ట్ కాదు, కానీ, ఇదే నా బలం. దీంతో బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు’ అని పేర్కొన్నాడు.

నేను టీమ్ ఇండియాకు ఆడతాననే నమ్మకం ఉంది – హర్షల్.. తన పరిమితులను గుర్తించి మైదానంలో తన నిజమైన సత్తా చాటేందుకు కృషి చేయడమే తన విజయ రహస్యమని హర్షల్ పటేల్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ, ‘నేను టాప్ లెవల్‌లో ఆడగలనని నాకు తెలుసు. నేను టాప్ లెవెల్‌లో బ్యాట్, బాల్ రెండింటిలోనూ బాగా రాణించగలను. నా సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా.. భారత జట్టులో అరంగేట్రం చేస్తాననే ఆలోచనతోనే ఆడాడు’ అని తెలిపాడు.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో హర్షల్ మాట్లాడుతూ, ‘ఏబీడీ నా కెరీర్‌పై పెద్ద ప్రభావాన్ని చూపించాడు. ఇటీవల యూఏఈలో నేను అతనితో మాట్లాడాను. ఆర్థికంగా ఎలా బౌలింగ్ చేయాలో అతనినుంచే నేర్చుకున్నాను. బ్యాట్స్‌మెన్ మంచి బంతిని కొడితే భయపడకుండా ఉండాలని, మంచి బంతులను కొట్టమని బ్యాట్స్‌మె‌న్‌ని బలవంతం చేయాలి. ఎందుకంటే మీరు రెండవ బంతిని వేస్తారని బ్యాట్స్‌మెన్ అనుకుంటాడు. అప్పుడే వారిని దెబ్బ తీయవచ్చని చెప్పాడని అన్నాడు.

హర్షల్‌కు అమెరికా గ్రీన్ కార్డ్ ఉంది.. హర్షల్ పటేల్‌కు అమెరికా గ్రీన్ కార్డ్ ఉందని మీకు తెలుసా? హర్షల్ కుటుంబం 2005లోనే అమెరికాలో స్థిరపడింది. కానీ, హర్షల్ తన అన్నయ్య కోరిక మేరకు భారతదేశంలోనే ఉండిపోయాను. ‘నేను చిన్నతనంలో చాలా అసహనానికి గురయ్యాను. కానీ, నా అనుభవాలు, పుస్తకాలు, విజయవంతమైన వ్యక్తుల నుంచి నేర్చుకున్నాను’ అని తెలిపాడు. ‘సహనం చాలా ముఖ్యమైనది. ఇది క్రమంగా వస్తుంది. ఏదైనా మంచి మార్పు రావాలంటే అందుకు చాలా ఓపిక పట్టాలి. నేను కూడా నెమ్మదిగా నేర్చుకున్నాను’ అని తెలిపాడు.

Also Read: T20 Cricket: 8 పరుగులకే 7 వికెట్లు.. నలుగురు జీరో.. అతికష్టం మీద ఖాతా ఓపెన్ చేసిన ఐదుగురు.. ఎంతకు ఆలౌట్ అయ్యారో తెలుసా?

క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన.. ప్రమాదంలో ఆ ఆటగాడి కెరీర్‌.. రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్న మాజీలు..!