T20 Cricket: 8 పరుగులకే 7 వికెట్లు.. నలుగురు జీరో.. అతికష్టం మీద ఖాతా ఓపెన్ చేసిన ఐదుగురు.. ఎంతకు ఆలౌట్ అయ్యారంటే?

మొత్తం 20 ఓవర్లు కూడా ఆడని ఆ జట్టు కేవలం 15.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 18 ఏళ్ల బౌలర్ ఒక్కడే నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేరారు.

T20 Cricket: 8 పరుగులకే 7 వికెట్లు.. నలుగురు జీరో.. అతికష్టం మీద ఖాతా ఓపెన్ చేసిన ఐదుగురు.. ఎంతకు ఆలౌట్ అయ్యారంటే?
Icc Men's T20 World Cup Africa Region Qualifier
Follow us
Venkata Chari

|

Updated on: Nov 20, 2021 | 6:32 PM

ICC Men’s T20 World Cup Qualifier: క్రికెట్ చరిత్రలో చాలా సార్లు జట్లు పేక మేడల్లా కుప్పకూలడం చూశాం. చాలా సార్లు పెద్ద జట్లు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది టీమ్ ఇండియా అయినా, ఆస్ట్రేలియా అయినా లేదా మరే పెద్ద జట్టు అయినా తనకు అనుకూలంగా లేని రోజు ఇలాంటి చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే జట్టు చాలా చిన్నది. ఈ జట్టు టాంజానియాకు చెందినది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికన్ రీజియన్ క్వాలిఫైయర్‌(T20 World Cup Africa Region Qualifier)లో ఉగాండాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఉగాండా బౌలర్ల ముందు టాంజానియా జట్టు పేకమేడలా కుప్పకూలడం కనిపించింది.

ఈ మ్యాచ్‌లో టాంజానియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభం బాగోలేకపోవడంతో ఆ జట్టు తిరిగి ట్రాక్‌లోకి రాలేక కుప్పకూలిపోయింది. టాంజానియా 7 వికెట్లు కేవలం 8 పరుగులకే పడిపోవడంతో పేలవమైన పరిస్థితికి చేరి ఆలైట్ అయింది. నలుగురు బ్యాట్స్‌మెన్ సున్నా వద్ద ఔటయ్యారు. అయితే ఐదుగురు ఖాతా తెరవడం కూడా కష్టంగా మారింది. జట్టు కూడా పూర్తి 20 ఓవర్లు ఆడలేదు. కేవలం 15.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఈ జట్టులో రెండు అత్యధిక స్కోర్లు ఉన్నాయి. 20, 18 పరుగులే టాంజానియా ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్లుగా నిలిచాయి. వీటిని రెండవ, మూడవ నంబర్ బ్యాట్స్‌మెన్స్ స్కోర్ చేశారు. దీంతో టాంజానియా జట్టు 68 పరుగులకే ఆలౌటైంది.

60/3 నుంచి 68కి ఆలౌట్.. ఒకదశలో అంటే 11 ఓవర్లలో 60 పరుగులకు 3 వికెట్లతో బాగానే కనిపించిన టాంజానియా జట్టు.. ఆ తర్వాత జట్టు మొత్తం 8 పరుగులకే ఆలౌట్ అవ్వడం విశేషం. అంటే మిగిలిన 7 వికెట్లు 8 పరుగులకే పడ్డాయి. టాంజానియా మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉగాండా బౌలర్ల ముందు నిలవలేకపోయారు. డేంజర్ బౌలర్‌గా పేరుగాంచిన 18 ఏళ్ల బౌలర్ ఫ్రాంక్ అకంకవాసా దెబ్బకు టాంజానియా అల్లకల్లోలం అయింది. అతను తన కోటాలో పూర్తి 4 ఓవర్లు కూడా వేయలేదు. కేవలం 3.4 ఓవర్ల బౌలింగ్‌లో 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి గట్టి షాక్ ఇచ్చాడు.

37 బంతుల్లోనే ఉగాండా విజయం.. టాంజానియా నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని ఉగాండా 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించింది. ఉగాండా తరుపున ఓపెనర్ సిమోన్ 39 పరుగులు చేయగా, బంతితో రెండు వికెట్లు తీసిన ముహుముజా 27 పరుగులిచ్చాడు. ఈ విజయంతో ఉగాండా జట్టు 5 మ్యాచ్‌లు ముగిసేసరికి 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Also Read: క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన.. ప్రమాదంలో ఆ ఆటగాడి కెరీర్‌.. రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్న మాజీలు..!

Abu Dhabi T10 League: అబుదాబిలో పరుగుల విధ్వంసం.. గేల్, స్టెర్లింగ్‌ల ధాటికి చేతులెత్తేసిన బౌలర్లు..!