- Telugu News Photo Gallery Cricket photos Abu Dhabi T10 League: Team Abu Dhabi players chris gayle, paul stirling super batting and bowler marchant de lange took 5 wickets vs Bangla Tigers
Abu Dhabi T10 League: అబుదాబిలో పరుగుల విధ్వంసం.. గేల్, స్టెర్లింగ్‌ల ధాటికి చేతులెత్తేసిన బౌలర్లు..!
అబుదాబి టీ10 లీగ్‌లో క్రిస్ గేల్ తన బ్యాట్‌ని ఝలిపించాడు. దీంతో బంగ్లా టైగర్స్‌పై అబుదాబి జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించి, ఘనమైన ఆరంభాన్ని దక్కించుకుంది.
Updated on: Nov 20, 2021 | 4:55 PM

అబుదాబి టీ10 లీగ్ తొలి మ్యాచ్‌లో అబుదాబి జట్టు అద్భుత విజయంతో శుభారంభం చేసింది. అబుదాబి జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. దీనికి బదులుగా బంగ్లా టైగర్స్ కేవలం 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 40 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

అబుదాబి టీ10 లీగ్ రెండో మ్యాచ్‌లో క్రిస్‌గేల్ తుఫాన్ బ్యాటింగ్‌తో అభిమానులు తడిసి ముద్దయ్యారు. క్రిస్ గేల్ కేవలం 23 బంతుల్లో 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 5 సిక్సర్లు, 2 ఫోర్లు వచ్చాయి. అంటే క్రిస్ గేల్ సిక్సర్లు, ఫోర్లతోనే 38 పరుగులు సాధించాడు.

గేల్‌తో పాటు పాల్ స్టెర్నింగ్ 23 బంతుల్లో 59 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐర్లాండ్ ఓపెనర్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. స్టెర్లింగ్, గేల్ రాణించడంతో అబుదాబి కేవలం 7 ఓవర్లలో 124 పరుగులు చేసింది.

గేల్, స్టెర్లింగ్ జోడీ బలమైన బ్యాటింగ్‌తో పాటు, ఫాస్ట్ బౌలర్ మర్చంట్ డి లాంగే తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఫాస్ట్ బౌలర్ 23 పరుగులకే ఐదుగురు బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ చేర్చాడు.

మర్చంట్ డి లాంగే 10 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. 7వ ఓవర్లో డి లాంగ్ 3 వికెట్లు తీశాడు. అతను తొలి బంతికే హజ్రతుల్లా జజాయ్‌ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఆ తర్వాతి బంతికి హోవెల్ ఫోర్ కొట్టాడు. దీని తర్వాత, హావెల్, ఫాల్క్‌నర్‌ల వికెట్లు పడగొట్టడం ద్వారా లాంగ్ తన ఐదు వికెట్లను పూర్తి చేశాడు.





























