Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..

Viral Video: ట్రక్ డ్రైవర్ అయినా.. బస్ డ్రైవర్ అయినా.. వాహనాన్ని నడపడానికి ముందు వారు తమ వాహనాల విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేస్తారు.

Viral Video: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..
Pilot
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 9:58 PM

Viral Video: ట్రక్ డ్రైవర్ అయినా.. బస్ డ్రైవర్ అయినా.. వాహనాన్ని నడపడానికి ముందు వారు తమ వాహనాల విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేస్తారు. అలా చేయడం ద్వారా గ్లాస్ క్లియర్‌గా ఉండి.. రహదారి స్పష్టంగా కనిపిస్తుంది. మార్గంలో ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ, మీరు ఎప్పుడైనా పైలట్‌ విమానం గ్లాస్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు చూశారా? ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈవీడియో సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ వైరల్ వీడియోలో.. విమానం కాక్‌పిట్‌లో కూర్చున్న పైలట్‌ బాటిల్‌లోని నీటిని విమానం విండ్‌షీల్డ్‌పై పోసి, ఆపై దాని వైపర్‌లతో గ్లాస్‌ను క్లీన్ చేస్తాడు. అచ్చం ట్రక్ డ్రైవర్ మాదిరిగా. పైలట్ అలా చేస్తుండగా.. కొందరు వీడియో తీశారు. 29 సెకన్ల ఆ వీడియోను @officeofdnj అనే ఇన్‌స్టాగ్రమ్ యూజర్ తన ఇన్‌స్టా‌లో షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 11 వేలకు పైగా వ్యూస్ రాగా, వందల కొద్ది లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Aditi Rao Hydari: తన అందాలతో ఫ్యాన్స్‌ని కవ్విస్తున్న అదితీ రావు హైదారీ

Viral Video: పుట్టిన వెంటనే బుడి బుడి అడుగులు వేసిన గున్న ఏనుగు.. ఎంత ముచ్చటగా ఉందో..!

Viral News: పీకలదాకా మద్యం తాగారు.. ఇంతలో పార్టీకొచ్చిన అనుకోని అతిధి.. చివర్లో షాకింగ్ ట్విస్ట్!