Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ బిడ్డకు పేరు పెడుతున్నారా? అయితే, ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోండి..

Parenting Tips: బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఆ బిడ్డకు పేరు పెట్టడం మొదలు.. వారి భవిష్యత్తు గురించి చర్చిస్తారు.

Parenting Tips: మీ బిడ్డకు పేరు పెడుతున్నారా? అయితే, ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోండి..
Child Name
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 10:17 PM

Parenting Tips: బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఆ బిడ్డకు పేరు పెట్టడం మొదలు.. వారి భవిష్యత్తు గురించి చర్చిస్తారు. చాలామంది తమ బిడ్డకు పుట్టిన తరువాత ఏ పేరు పెట్టాలని ముందుగానే ఆలోచిస్తారు. జ్యోతిష్యం ప్రకరాం.. ఏది సరైంది, ఏది సరికాదు అనేది కూడా క్లియర్‌గా ఆలోచిస్తారు. సనాతన ధర్మంలోని 16 మత కర్మలలో నామకరణం ఒకటి.

పిల్లలు పెట్టే పేరు వారి జీవితాంతం గుర్తుండిపోతుంది. దీని ప్రభావం వ్యక్తి జీవితం, ప్రవర్తన, విధిపై కూడా కనిపిస్తుంటుంది. అందుకే జ్యోతిష్య నియమాలను దృష్టిలో ఉంచుకుని పేరు పెట్టాలని వేదాంతులు సూచిస్తున్నారు. మీరు కూడా మీ పిల్లలకు పేరు పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

రాశిచక్రం ప్రకారం పేరు.. రాశిచక్రం ప్రకారం పిల్లలకు పేరు పెట్టాలి. పుట్టిన సమయంలో పిల్లల జాతకాన్ని చూసి.. జ్యోతిష్కులు పిల్లల పేరు అక్షరాన్ని సూచిస్తారు. దాని ఆధారంగా పిల్లలకు పేరు పెట్టాలి. ఆ అక్షరం గ్రహం, రాశిచక్రం అనుకూలత ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది.

పేరు పెట్టే రోజు విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.. పిల్లల నామకరణం చేసే ముందు ప్రత్యేక రోజు గురించి తీసుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం బిడ్డ పుట్టిన తరువాత పదకొండవ, పదహారవ రోజున పిల్లల నామకరణ కార్యక్రమం చేయాలి. అలా కాకుండా.. వేదపండితుల సూచన మేరకు శుభ తేదీని కూడా నిర్ణయించుకోవచ్చు. కానీ, పూర్ణిమ, అమవాస్య రోజున మాత్రం నామకరణం చేయొద్దు.

రాశిని జాగ్రత్తగా చూసుకోవాలి.. నామకరణం సరైన నక్షత్రంలో చేస్తే శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. గ్రంథాలలో అనురాధ, పునర్వసు, మాఘ, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, శతభిష, స్వాతి, ధనిష్ట, శ్రావణ, రోహిణి, అశ్విని, మృగశిర, రేవతి, హస్త, పుష్య నక్షత్రాలు నామకరణానికి శ్రేష్ఠమైనవిగా భావిస్తారు.

పేరు అర్థవంతంగా ఉండాలి.. ఇంట‌ర్నెట్‌లో పిల్లల పేర్లు చూసి.. నచ్చిన పేరును పెట్టుకుంటారు. కానీ ఆ ప‌ద్ధతి త‌ప్పు అని వేదపండితులు చెబుతున్నారు. ఏ పేరు పెట్టినా అర్థవంతంగా ఉండాలి. ఎందుకంటే పేరులోని అర్థం.. పిల్లల వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే శిశువుకు అర్థవంతమైన పేరును పెట్టాలి.

పేరు స్పెల్లింగ్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.. న్యూమరాలజీలో కూడా పేరుకు ప్రాధాన్యత ఉంది. ఇది వ్యక్తి భవిష్యత్తు గురించి చాలా చెబుతుంది. చాలా మంది సెలబ్రిటీలు న్యూమరాలజీ స్పెషలిస్ట్ ద్వారా తమ పేర్ల స్పెల్లింగ్‌ని సవరించుకుంటారు. అందువల్ల, పండితుల నుంచి పేరు మొదటి అక్షరాన్ని తెలుసుకున్న తరువాత.. న్యూమరాలజీ నిపుణుల సహాయంతో వారి పేరు స్పెల్లింగ్‌ను నిర్ణయించుకుంటే మంచింది. అన్ని చూసుకుని పేరు నిర్ణయిస్తే వారి భవిష్యత్ బంగారుమయం అవుతుంది.

Also read:

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

Exclusive: బయో బబుల్‌లో ఆడే క్రికెటర్లకు అది తప్పనిసరి.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆ విషయంలో ఘోర వైఫల్యం: వరల్డ్ నంబర్ వన్ టెస్ట్‌ ఆల్‌ రౌండర్‌

Health Tips: ఈ 5 చిట్కాలు.. ఉదర సమస్యల నుండి బయటపడేందుకు దివ్యౌషధాలు..