Dreams: మీ కలలో ఇలాంటివి కనిపిస్తే.. త్వరలోనే ధనవంతులు అవుతారని అర్ధం.! అవేంటో తెలుసుకోండి..
ప్రతీ ఒక్కరూ నిద్రించేటప్పుడు కలలు కనడం సహజం. కలల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచివి కాగా.. రెండోది చెడ్డవి...
ప్రతీ ఒక్కరూ నిద్రించేటప్పుడు కలలు కనడం సహజం. కలల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచివి కాగా.. రెండోది చెడ్డవి. కొన్నిసార్లయితే మన ఆలోచనలే కలల రూపంలో వస్తుంటాయి. ఇదిలా ఉంటే.. మెలుకువ వచ్చిన తర్వాత కూడా కొన్ని అద్భుతమైన కలలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే కలల్లో కనిపించే కొన్ని సంకేతాలు మన భవిష్యత్తులో ఏం జరుగుతున్నది సూచిస్తాయి. ప్రముఖ జోతిష్యుడి డాక్టర్ అరవింద్ మిశ్రా మాట్లాడుతూ.. కలలు మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పుకొచ్చారు. అవి భవిష్యత్తు గురించి పలు సూచనలు ఇస్తాయన్నారు. కలలకు సంబంధించిన శుభ, అశుభ ఫలితాలు స్వప్న శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. మరి శుభ ఫలితాలు ఇచ్చే ఆ కలలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మీ కలలో పాము మిమ్మల్ని కాటేస్తే.. మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం. ఒకవేళ పాము మీ తలపై కాటేసినట్లు కల వస్తే.. మీరు అతి త్వరలో కోటీశ్వరులు కావచ్చు.
2. దేవుడు, తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులు, బంధువులు.. ఇలా ఎవరినైనా మీరు కలలో చూసినట్లయితే.. దానిని శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే మిమ్మల్ని మీరు చనిపోయినట్లు చూడటం, రక్తం కారడం, స్వర్గాన్ని చూడటం, పామును చంపడం, సూర్యగ్రహణం లేదా చంద్ర గ్రహణం చూడటం, సైన్యాన్ని చూడటం, వర్షాన్ని చూడటం.. లాంటివి మీ కలలో కనిపిస్తే.. త్వరలోనే మీ చిరకాల కోరికలు నెరవేరుతాయని అర్ధం.
3. శ్మశాన వాటికలో శవాన్ని, అంత్యక్రియలు జరపడాన్ని మీరు కలలో చూసినట్లయితే.. అవి శుభ ఫలితాలకు సంకేతం. మీకు లాభదాయక ప్రయోజనాలు చేకూరుతాయి, కోరికలు తీరుతాయి. ఒకవేళ మీరు మృతదేహాన్ని, ఏనుగు లేదా గుర్రం మిమ్మల్ని వెంబడించడం లాంటి కలలు కంటే.. సొసైటీలో మీరు గొప్ప గౌరవాన్ని పొందటం లేదా పదోన్నతి లభిస్తుందని చెప్పడానికి సంకేతం.
4. కలలో అందమైన స్త్రీ లేదా వనదేవతను చూసినట్లయితే.. ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో సయోధ్య కుదురుతుందని అర్ధం. పళ్లు విరిగినట్లు, గోర్లు కత్తిరించినట్లు కనిపిస్తే.. మీ పేదరికం దూరమవుతుందని సంకేతం.
5. మీ కలలో రైలు కనిపిస్తే.. మీరు ప్రయాణం చేయాల్సి వస్తోందని అర్ధం. తోట లేదా పచ్చని పొలాన్ని చూసినట్లయితే.. అది శుభ సంకేతం. మీరు త్వరలోనే ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడబోతున్నారని అర్ధం.
6. మీరు ఎగురుతున్నట్లుగా కలలో కనిపిస్తే.. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అర్ధం. మీ కలలో పావురాన్ని చూసినట్లయితే, త్వరలోనే పలు శుభవార్తలను వింటారని అర్థం చేసుకోండి.
7. ఒక వ్యక్తి తాను పోగొట్టుకున్న వస్తువును కలలో పొందినట్లయితే, అతడు రాబోయే జీవితంలో ఆనందాన్ని పొందుతాడు. ఒక వ్యక్తికి తన కలలో పర్వతాన్ని అధిరోహించినట్లు కనిపిస్తే, రాబోయే రోజుల్లో గొప్ప విజయాన్ని అందుకుంటాడని సంకేతం.
8. మీ కలలో బిడ్డను ఒడిలో పెట్టుకుని అడిస్తున్నట్లు కనిపిస్తే.. బిడ్డ కలగాలనే కోరిక త్వరలోనే నెరవేరుతుందని అర్ధం.
9. బ్యాచిలర్స్ తమ కలలో నేలపై పడి ఉన్న ఆయుధాలను చూస్తే, ఎంతో శుభప్రదం. త్వరలోనే మీ ఇష్టాయిష్టాలకు తగిన జీవిత భాగస్వామిని పొందబోతున్నారని అర్థం.