Tripple Talaq Case: జార్ఖండ్‌‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు.. భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాక్!

దేశవ్యాప్తంగా బేటీ బచావో బేటీ పఢావో ప్రచారం జరుగుతుండగా, దుమ్కాలో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు.

Tripple Talaq Case: జార్ఖండ్‌‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు.. భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాక్!
Talaq
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 21, 2021 | 8:00 AM

Tripple Talaq Case: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు చూసింది. కూతుళ్లను కాపాడాలంటూ దేశవ్యాప్తంగా బేటీ బచావో బేటీ పఢావో ప్రచారం జరుగుతుండగా, దుమ్కాలో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఓ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ వ్యవహారం దుమ్కా జిల్లా షికారిపాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హసీనా బీబీ అనే మహిళ తన భర్తపై శికారిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డిపిఓ) నూర్ ముస్తఫా అన్సారీ తెలిపారు. విచారణ అనంతరం ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

బిచియా పహారీ గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువతి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని మహిళ ఆరోపించింది. బాధిత మహిళ హసీనా బీబీ ఫిర్యాదు మేరకు శికారిపాడు పోలీస్ స్టేషన్‌లో ట్రిపుల్ తలాక్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు నిందితుడైన భర్త సలీం అన్సారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

హసీనా బీబీ ఫిర్యాదు ప్రకారం, 2011లో కతికుండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిచియా పహారీ గ్రామానికి చెందిన సలీం అన్సారీతో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత వీరికి ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఇక, కొడుకు పుట్టలేదంటూ తరుచు భర్త వేధించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో తన భర్త తన తండ్రి నుండి లక్షన్నర రూపాయలు తీసుకురావాలని కోరాడని, డబ్బు తీసుకురాకపోతే, ఇంటికి రావద్దని వేధించాడంటూ మహిళ ఆరోపించింది. ఈ విషయమై గ్రామ పంచాయతీ స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయని బాధిత మహిళ తెలిపారు. కానీ ఆమె భర్త సలీం అన్సారీ వినకపోవడంతో సలీమ్‌పై కేసు నమోదైంది. ట్రిపుల్ తలాక్ చట్టం ప్రకారం అన్సారీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు.

Read Also… Crime News: ప్రేమ గుడ్డి వాడిని చేసింది.. పెళ్లి తిరస్కరించిన యువకుడిపై యాసిడ్‌ పోసిన వివాహిత!