AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sinus Problem: చలికాలంలో సైనస్‌ సమస్యకు సొల్యూషన్ ఇదే..

వాతావరణం చల్లగా మారేకొద్దీ జలుబు, దగ్గు లాంటివి మొదలవుతుంటాయి చాలామందికి. వీటిని సీజన్లో వచ్చిపోయే చిన్నపాటి సమస్యలు అనుకుని వదిలేస్తుంటారు. అయితే జలుబు, దగ్గు, తుమ్ములు ఎన్నిరోజులైనా తగ్గకపోతే అది సైనసైటిస్కి దారి తీయొచ్చు. ఈ సీజన్‌లో సైనసైటిస్ బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Sinus Problem: చలికాలంలో సైనస్‌ సమస్యకు సొల్యూషన్ ఇదే..
Sinus Problem
Nikhil
|

Updated on: Oct 31, 2025 | 5:49 PM

Share

ముఖంలో ఉండే సైనసిస్​ అనే గాలి గదుల్లో వచ్చే ఇన్ఫెక్షన్‌ను సైనసైటిస్ అంటారు. ఈ సైనసిస్‌లు కళ్లకు మధ్యలో  రెండు, బుగ్గల దగ్గర రెండు ​, నుదుటి వెనుక రెండు, మెదడు భాగంలో మరో రెండు ఉంటాయి. ఈ ఎనిమిది సైనసిస్ గదులన్నీ గాలితో నిండి ఉంటాయి. ఇవి  పీల్చేగాలిని రెగ్యులేట్​ చేస్తాయి. తీసుకునే గాలిని శరీరం టెంపరేచర్‌‌కు తగ్గట్టు వేడిగా, తేమగా ఉండేలా చేస్తాయి. ఈ సైనస్​ గదులకు గాయమైనా,  ఇన్ఫెక్షన్ సోకినా దాన్ని సైనసైటిస్ అంటారు. చల్లని గాలి, దుమ్ము, ధూళి, కాస్మొటిక్స్, పొల్యూషన్ వల్ల వాతావరణంలో రిలీజ్ అయ్యే కెమికల్స్, పెట్స్, స్విమ్మింగ్ పూల్ వాటర్‌‌లో ఉండే క్లోరిన్.. ఇలా రకరకాల​ అలర్జీలు సైనసైటిస్​ రిస్క్​ని పెంచుతాయి. దీంతోపాటు వైరస్, బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ వల్ల కూడా సైనస్ రావొచ్చు.

లక్షణాలు ఇలా..

సైనస్ గదులన్నీ ముక్కుతో కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముందుగా ముక్కు పట్టేస్తుంది. కొన్నిసార్లు ముక్కు నుంచి నీరు కారుతుంది. తుమ్ములు, దగ్గు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  కళ్లు, చెవులు, దంతాల చుట్టూ నొప్పి, వాపు ఉండొచ్చు. ముక్కు వెనక భాగం నుంచి గొంతులోపలికి లిక్విడ్స్ విడుదలవుతాయి. దాంతో పొడి దగ్గు వస్తుంది. చాలామందికి ముఖమంతా నొప్పి పెడుతుంది. కొందరికి ముక్కు, కళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది. కనుబొమల దగ్గర జివ్వుమని లాగుతుంది. సైనసైటిస్​ ఎక్కువయ్యే కొద్దీ తలనొప్పి పెరుగుతుంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు, వయసు పైబడిన వాళ్లలో సైనస్ ఎక్కువగా వస్తుంటుంది. సైనస్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌‌ను కలవాలి.

రిలీఫ్ ఇలా..

సైనసైటిస్‌తో బాధపడేవాళ్లు నాజల్​ స్ప్రేలు వాడితే కొంత రిలీఫ్​ ఉంటుంది. సైనస్‌ ఉన్నవాళ్లు చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలు తినకూడదు. అలర్జీలు కలిగించే వాటికి దూరంగా ఉండాలి. పొల్యూషన్‌కు ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి.  భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. స్మోకింగ్ అలవాటు సైనస్‌ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి.

నోట్: ఇందులో అందించిన సమాచారం, పరిష్కారాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. వాటిని అనుసరించే ముందు దయచేసి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?