Coffee Side Effects: కాఫీ అధికంగా తాగుతున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే.!

కాఫీ అంటే చాలా మంది ఇష్టపడతారు..అలసట లేకుండా పనిచేయాలన్నా, ఉత్సాహం, ఉత్తేజంగా ఉండాలన్నా కాఫీని సేవించాల్సిందే..

Coffee Side Effects: కాఫీ అధికంగా తాగుతున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే.!
Coffee
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:02 PM

కాఫీ అంటే చాలా మంది ఇష్టపడతారు..అలసట లేకుండా పనిచేయాలన్నా, ఉత్సాహం, ఉత్తేజంగా ఉండాలన్నా కాఫీని సేవించాల్సిందే. ముఖ్యంగా నైట్ షిప్టు లో పనిచేసేవారికి కాఫీ చాలా సహాయకారి. అయితే చాలా మంది కాఫీని ఎప్పుడుపడితే అప్పుడు కప్పులు కప్పులు లాగించేస్తారు. దీని వల్ల మాత్రం చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. కాఫీని అధికమొత్తంలో తాగడం అది చేసే మేలు తక్కువై, కీడే ఎక్కువవుతుంది. ఇది ఆల్కాహాల్ కన్నా హానికరం కావచ్చు. అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలని, అప్పుడు ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అంటున్నారు వైద్యులు.

కాఫీ అధికంగా తాగేవారిలో మానసిక ఆందోళన పెరుగుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పెంచుతుంది. ఇది నియంత్రణలో ఉన్నంత మేరకు ఆరోగ్యానికి మంచిదే. అధికంగా కెఫీన్ ఒంట్లో చేరడం వల్ల మెదడులో ఉండే అడెనోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల మీకు అలసటగా అనిపిస్తుంది. ఆందోళన పెరుగుతుంది.

రాత్రి షిప్టుల్లో పనిచేసేవారు సాయంత్రం ఒక కాఫీ తాగితే చాలు, రాత్రి నిద్రరాకుండా పనిచేసుకోగలరు. అలాంటిది ఉదయం నుంచి ఆరేడు కప్పుల కాఫీ తాగే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? రాత్రిపూట నిద్ర సరిగా పట్టక పోవడం వల్ల, కొన్నాళ్లకు అది ఇన్సోమ్నియాగా మారిపోతుంది. కాఫీ నిద్ర షెడ్యూల్ మొత్తాన్ని డిస్ట్రబ్ చేస్తుంది.

ఏదైనా వ్యసనంగా మారితే దాని వల్ల నష్టమే. రోజూ అయిదారు కప్పులు మించి కాఫీ తాగే వాళ్లలో కొన్నాళ్లకి ఇది ఆల్కహాల్ లాగే భయంకరమైన వ్యసనంగా మారిపోతుంది. ఇక కాఫీ తాగకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ ఒకరకమైన కొకైన్ లాంటిదే. ఇది మెదడు రసాయనాలను తీవ్రంగా వశపరచుకుని, వ్యసనంగా మార్చేస్తుంది.

ఖాళీ కడుపుతో పరగడుపునే కాఫీ తాగడం మంచిది కాదు. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ ను ప్రేరేపిస్తుంది. కెఫీన్ శక్తినిస్తుందనే నిజమే కానీవ, అధికమొత్తంలో చేరిన కెఫీన్ అలసటకు కారణమవుతుంది. కాఫీ రోజుకు రెండు కప్పులకు మించి తాగకపోవడం మంచిది. ఈ రెండు కప్పులు చాలు మీకు ఉత్సాహాన్నివ్వడానికి. ముఖ్యంగా మధ్యాహ్నం మూడు దాటాక కాఫీ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమంటున్నారు నిపుణులు.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?