Viral News: 30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఇంగ్లండ్‌లో ఓ మహిళ వింత ఫోబియాతో బాధపడుతుంది. ఆహారాన్ని చూస్తేనే భయంతో ఆమెకు చెమటలు పోస్తాయి. సాస్ కలిపిన..
ఇంగ్లండ్‌లో ఓ మహిళ వింత ఫోబియాతో బాధపడుతుంది. ఆహారాన్ని చూస్తేనే భయంతో ఆమెకు చెమటలు పోస్తాయి. సాస్ కలిపిన ఆహారాన్ని చూసినా .. వేర్వేరు పదార్థాలను కలిపి వండినా, మిల్క్‌షేక్ లాంటి చిక్కటి లిక్విడ్ ఇంకా కూరగాయాలు చూసినా ఆమెకు చెమటలు పడతాయట. ప్రస్తుతం ఆమె కేవలం టమాటా సూప్ తాగుతూ బతికేస్తుంది. అది కూడా బౌల్‌లో వడ్డిస్తేనే తాగుతుందట.
నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన షార్లెట్ విటిల్ తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా ఆకుకూరలు, కూరగాయలు తినలేదట. గత కొన్నేళ్లుగా ఆమె చికెన్ నగ్గెట్స్, రైస్ కేక్స్ తింటూ గడిపేస్తోంది. బాల్యం నుంచి కూడా షార్లెట్ సరిగా తినేది కాదట. అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆకలిగా లేదోమో అందుకే.. తినడం లేదని భావించేవారు. ఆహారాన్ని సరిగా ఉడికించపోయినా.. సరిగా వడ్డించకపోయినా ఆమెకు పొట్లలో కలవరం మొదలవుతుందట. మొదట్లో. బలవంతంగా ఏదైనా తిందామని ప్రయత్నిస్తే వామిట్ అయ్యేదట.
రాను రాను ఈ పరిస్థితి మరింత తీవ్ర కాసాగింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది షార్లెట్‌కి ఆహారం అంటే భయం పెరిగిందే తప్ప దాని మీద ఇష్టం కలగడం లేదు. ఈ క్రమంలో షార్లెట్ తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. డాక్టర్లు షార్లెట్‌ను పరిశీలించి.. ఆమె ఒక వింత ఫుడ్ ఫోబియాతో బాధపడుతుందని తెలిపారు. దీనివల్ల షార్లెట్ స్కూల్ లంచ్‌లో కంచం ఖాళీ చేయలేక గుక్కపట్టి ఏడ్చేది.
చదువు పూర్తయిన తర్వాత షార్లెట్‌కి ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆఫీసులో ఉద్యోగులందరికి వంట చేసి పెడతారు. ధైర్యం చేసి తనకు ఉన్న ఫోబియా గురించి చెప్పి.. తన ఆహారాన్ని తనే వండుకోవడం మొదలుపెట్టింది. ఈ ఫోబియా షార్లెట్ సోషల్ జీవితం మీద చాలా ప్రభావం చూపించింది. దీని వల్ల స్నేహితులతో కలిసి బయట తినడానికి వెళ్లలేకపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రయత్నం ప్రారంభించింది. త్వరలోనే ఈ భయాన్ని జయిస్తాను అని కూడా అంటోంది.
Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!
గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!
ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!