ప్రేమంటే ఇదే.. అప్యాయంగా ఫారెస్ట్ ఆఫీసర్‏ను కౌగిలించుకున్న పిల్ల ఏనుగు.. హత్తుకుంటున్న ఫోటో..

కాస్త చేరాదీస్తే అమితంగా ప్రేమించేస్తాయి... ప్రేమతో ఆహారం ఇస్తే.. ఎక్కడున్న గుర్తుపెట్టుకుంటాయి.. మనిషి ప్రవర్తనలో మార్పు రావచ్చేమో..

ప్రేమంటే ఇదే.. అప్యాయంగా ఫారెస్ట్ ఆఫీసర్‏ను కౌగిలించుకున్న పిల్ల ఏనుగు.. హత్తుకుంటున్న ఫోటో..
Elephant Viral Photo
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 16, 2021 | 8:56 AM

కాస్త చేరాదీస్తే అమితంగా ప్రేమించేస్తాయి… ప్రేమతో ఆహారం ఇస్తే.. ఎక్కడున్న గుర్తుపెట్టుకుంటాయి.. మనిషి ప్రవర్తనలో మార్పు రావచ్చేమో.. కానీ జంతువుల ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. దగ్గరకు అప్యాయంగా తీసుకుంటే చాలు.. ఎప్పుడు కనిపించిన ఠక్కున గుర్తుపటేస్తాయి… అయితే చాలా మంది తమ ఇళ్లలో కుక్క పిల్లలను పెంచుకుంటుంటారు. వాటిని తమ ఇంటి సభ్యులుగానే భావిస్తారు. ఇక అవి కూడా.. తమ యాజమానులకు ఎంతో విశ్వసంగా ఉంటాయి.. అలాగే అడవిలో ఉంటే జంతువులు కూడా మనుషులు ప్రేమగా చూసి ఆదరించిన ముగ్దులయిపోతాయి.. అది చిన్న జంతువైనా.. పెద్ద జంతువైన ప్రేమను అందించడంలో మాత్రం వ్యత్యాసం ఉండదు.. ఇక మన మాదిరిగానే .. ఏనుగులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. తమ ప్రాణం కాపాడినవారిని ఎక్కువగానే ఇష్టపడుతుంటాయి. తాజాగా ఓ పిల్ల ఏనుగు చేసిన పని చూస్తే తెగ ముచ్చటేస్తుంది.

ప్రస్తుతం ఓ పిల్ల ఏనుగు.. ఫారెస్ట్ ఆఫీసర్‏కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటో నెటిజన్స్ మనసును హత్తుకుంటుంది. ఇంతకీ అందులో ఏముంది అనుకుంటున్నారా.. తనను కాపాడిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్‏పై అమితమైన ప్రేమ కురిపించింది పిల్ల ఏనుగు.. తమిళనాడులోని అటవీ శాఖ అధికారులు.. గాయపడిన ఒక పిల్ల ఏనుగును కాపాడి తల్లి ఏనుగు వద్దకు చేర్చారు. కాగా.. పిల్ల ఏనుగును తీసుకువెళ్తున్న క్రమంలో అది అతడిని వెనకవైపు నుంచి తడుముతూ తన ప్రేమను తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోను అటవీ శాఖ అధికారి ప్రవీణ్ కశ్వన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ప్రేమకు నిజంగానే భాష లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Trisha: డిజిటల్ పై సత్తా చాటేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్.. ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న త్రిష..

Manchu Vishnu: ఈరోజే మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. ఆ ఇద్దరే ముఖ్య అతిథులు..

Bigg Boss 5 Telugu: రైస్ కుక్కర్ తెచ్చిన తంట.. ప్రియ పై చిందులేసిన శ్వేత.. మీ టోన్ నచ్చలేదంటూ..