Manchu Vishnu: ఈరోజే మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. ఆ ఇద్దరే ముఖ్య అతిథులు..

వరుస ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి.. ఇక అదే రోజు సాయంత్రం ఫలితాలు

Manchu Vishnu: ఈరోజే మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. ఆ ఇద్దరే ముఖ్య అతిథులు..
Manchu Vishnu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 16, 2021 | 8:01 AM

వరుస ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి.. ఇక అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా వచ్చేశాయి. హోరా హోరీగా జరిగిన పోరులో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించాడు.. ఇక మంచువిష్ణు ఎన్నికైన అనంతరం అనుహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్లో గెలిచిన సభ్యులు.. మిగిలిన సభ్యులు మొత్తం మూకుమ్మడిగా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇక మా కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మంచు విష్ణు.. కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‎లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు.

మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే… నందమూరు బాలకృష్ణను సైతం ఆహ్వానించారు మంచు విష్ణు.. నిన్న నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణు చర్చించారు. అలాగే.. పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం‏ను కలసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని కోరారు మంచు విష్ణు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్‎ను ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పాడు మంచు విష్ణు.

ఇదిలా ఉంటే… గురువారం మంచు మనోజ్ పవన్ కళ్యాణ్‏తో దాదాపు గంట సేపు భేటి అయ్యారు.. విష్ణు ప్రమాణ స్వీకారానికి పవన్‏ను రావాలని కోరారు.. అలాగే.. మరికొందరు పెద్దలకు.. ఆత్మీయులకు ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు మంచు విష్ణు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానని అన్నారు మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్‏లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్‏లో ఆహ్వాన సందేశం పంపారు విష్ణు… ప్రతి మా సభ్యుడికి ఎస్ ఎం ఎస్ ద్వారా ఆహ్వానం పంపిన మా కార్యాలయం.

Also Read: Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..

Aadi Saikumar: ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో రానున్న ఆది సాయికుమార్.. నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో..