Aadi Saikumar: ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో రానున్న ఆది సాయికుమార్.. నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో..

Rajeev Rayala

Rajeev Rayala | Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2021 | 6:52 AM

సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్‌. ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది సాయికుమార్‌.

Aadi Saikumar: ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో రానున్న ఆది సాయికుమార్.. నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో..
Aadi Sai Kumar

Aadi Saikumar : సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్‌. ప్రేమ‌కావాలి, ల‌వ్‌లీ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది సాయికుమార్‌. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఆది. ఈ క్రమంలో ఇప్పుడు నయా సినిమాను మొదలు పెట్టారు. ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్‌లో అలాంటి కథలనే ఎంచుకుంటున్నాడు ఆది. ఆది హీరోగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో నూత‌న చిత్ర ప్రారంభోత్స‌వ కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ సినిమాకు శివ‌శంక‌ర్ దేవ్  ద‌ర్శ‌కుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని అజ‌య్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. నిర్మాత పుస్క‌ర రామ్మోహాన రావు హీరో ఆదిపై క్లాప్ ఇవ్వ‌గా… నిర్మాత కేఎస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ… ‘నా కెరీర్ లో ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. క‌థ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను అన్నారు. ద‌ర్శ‌కుడు చాలా డీటైల్డ్ గా ఈ సినిమాపై ప‌ని చేసాడు అన్నారు. శాంత‌య్యగారితో నాకు చాలా సంవ‌త్స‌రాలుగా స్నేహం ఉంది. ఆయ‌న కుమారుడు నిర్మాత‌గా నా సినిమాతో ప‌రిచ‌యం అవ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఆది. దర్శకుడు దేవ్ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. అందరం కథను నమ్మి ముందుకు వెళుతున్నాం. హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అని అన్నాడు ఆది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej: మా ఇంట్లో రెండు పండగలంటున్న మెగా ఫ్యామిలీ.. బ్యాచ్‌లర్‌గా లాస్ట్ బర్త్ డే అంటూ.. సాయి ధరమ్‌కు విశేష్ చెప్పిన మెగా కజిన్స్..

Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

Jai Bhim: “బాధింపబడ్డ వారికి లభించని న్యాయం.. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది”

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu