Srikanth on MAA Elections: కొంచెం బాధగా... కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి 'మా' ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

Srikanth on MAA Elections: కొంచెం బాధగా… కొంచెం సంతోషంగా ఉంది.. మరోసారి ‘మా’ ఎలక్షన్స్ పై శ్రీకాంత్ మాటల్లో..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 15, 2021 | 8:43 PM

‘మా’ వార్ ముగిసింది. ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్య జరిగిన ఈ పోరులో మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. మొదటినుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు అలాగే విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది.

‘మా’ వార్ ముగిసింది. ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్య జరిగిన ఈ పోరులో మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. మొదటినుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్ కు అలాగే విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది. ఒకరినొకరు తిట్టుకోవడం, బరిలో ఉన్న అభ్యర్థులు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌‏లు తమ ప్యానెళ్లతో కలిసి ముమ్మర ప్రచారాన్నిచేయడం. ఎన్నికల ముందు రోజు వరకు ఒకరికి ఒకరు సీరియస్ వార్నింగులు ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలో వేడిని పెంచారు. 
అయితే హోరాహోరీగా సాగిన మా పోరులో మంచు విష్ణు ఘన విజయం సాధిచారు. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. విష్ణు గెలుపుతో కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈసీ మెంబర్స్ విషయంలో మాత్రం ఫలితాలు విభిన్నంగా వచ్చాయి. ప్రకాశ్ రాజ్‌కు ప్యానల్‌కు చెందిన 11 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా గెలవగా.. విష్ణు ప్యానల్‌కు చెందిన ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా గెలిచారు.ఇక ఈ ఎన్నికల్లో తన విజయం గురించి నటుడు శ్రీకాంత్ స్పందించారు. తాను విజయం సాధించిన దానికంటే ప్రకాష్ రాజ్ ఓడిపోవడమే బాధగా ఉందని శ్రీకాంత్ చెప్పారు. ఇక ఈ పోటీలో శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. అలాగే మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు ఆయన అభినందనలు తెలిపారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Coal crisis In India: దేశంలో కరెంట్‌ కోత.. బొగ్గు కొరతకు కారణాలేంటి ?(వీడియో)

 Warning to Beer Lovers: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో)

 Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. 2,226 పోస్టులకు దరఖాస్తులు..(వీడియో)

 VIP Tree Video: వీఐపీ చెట్టు.. 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ ఆ చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా..?(వీడియో)