Coal crisis In India: దేశంలో కరెంట్‌ కోత..  బొగ్గు కొరతకు కారణాలేంటి ?(వీడియో)

Coal crisis In India: దేశంలో కరెంట్‌ కోత.. బొగ్గు కొరతకు కారణాలేంటి ?(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 15, 2021 | 8:26 PM

బొగ్గు కొరత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, రాజస్తాన్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌లో విద్యుత్తు సరఫరా పరిస్థితి దిగజారింది.

బొగ్గు కొరత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, రాజస్తాన్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌లో విద్యుత్తు సరఫరా పరిస్థితి దిగజారింది. పంజాబ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13 వరకు రోజూ 3 గంటల పాటు విద్యుత్తు కోత విధిస్తామని పీఎస్‌పీసీఎల్‌ ప్రకటించింది. థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో వాటిని 50 శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉత్పత్తి సంస్థల వద్ద తగినన్ని బొగ్గు నిల్వలు లేకపోవడానికి కేంద్రం అనుసరించిన విధానం కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. విదేశీ బొగ్గును భారీగా నిల్వ చేసిన కొన్ని కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసేవిధంగా కృత్రిమ కొరతను సృష్టించారనే వాదన వినిపిస్తుంది. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలైన కోల్‌ఇండియా, సింగరేణి, మహానది గనులు దేశీయంగా బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, ప్రైవేట్‌రంగంలోని పలు కార్పొరేట్‌ కంపెనీలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొని, విద్యుదుత్పత్తి సంస్థలకు విక్రయిస్తున్నాయి.

కరోనా వ్యాప్తి ఉధృతి తగ్గుముఖం పట్టడం, వివిధ కంపెనీల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకొంటుండంతో గత కొంతకాలంగా విద్యుత్తు సరఫరాకు డిమాండ్‌ పెరుగుతుంది. వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్న ఏప్రిల్‌, మే నెలలతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్తు వినియోగం 20శాతం పెరిగినట్టు అంచనా. విద్యుత్తు సరఫరా డిమాండ్‌ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 170 థర్మల్‌ పవర్‌ప్లాంట్లలోని బొగ్గు నిల్వలు కరిగిపోయాయి.

కాగా.. బొగ్గు కొరత, విద్యుత్తు సంక్షోభంపై అనవసర భయాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ అన్నారు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపడా బొగ్గునిల్వలు ఉన్నాయని, కేంద్రం ఎప్పటికప్పుడు బొగ్గు సరఫరా చేస్తున్నదని తెలిపారు. ఢిల్లీలో విద్యుత్తు సంక్షోభం లేదన్నారు. కాంట్రాక్టు అయిపోతున్నందున గ్యాస్‌ సరఫరా ఆపేస్తామని గెయిల్‌ ఢిల్లీ డిస్కంలకు సమాచారం ఇవ్వడంవల్లే విద్యుత్తు సంక్షోభంపై అనుమానాలు తలెత్తి ఉండొచ్చన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Warning to Beer Lovers: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో)

 Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. 2,226 పోస్టులకు దరఖాస్తులు..(వీడియో)

 VIP Tree Video: వీఐపీ చెట్టు.. 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ ఆ చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా..?(వీడియో)

 Viral Video: ఇంటిని దోచుకుని, కలెక్టర్‌కు లేఖ రాసిన దొంగలు..! నెట్టింట వైరల్‌ అవుతున్న వార్త..(వీడియో)