Warning to Beer Lovers: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో)
నేటి యువతరం వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పార్టీలు చేస్తుంటారు. ఆ పార్టీలలో కచ్చితంగా బీర్ బాటిల్స్ ఉండాల్సిందే. ఎందుకంటే బీర్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుంది.
నేటి యువతరం వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పార్టీలు చేస్తుంటారు. ఆ పార్టీలలో కచ్చితంగా బీర్ బాటిల్స్ ఉండాల్సిందే. ఎందుకంటే బీర్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు చాలామందికి ఒక అపోహ కూడా ఉంటుంది. బ్రాంది, విస్కీతో పోల్చితే బీర్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ బీర్‌లో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఇది బ్రాంది, విస్కీలా ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాలేయం, మెదడుని ప్రభావితం చేస్తుంది. బీర్ ప్రభావం శరీరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
బీర్ తాగినప్పుడు అది నేరుగా చిన్న పేగులలోకి వెళుతుంది. తర్వాత బీర్‌లో ఉన్న ఆల్కహాల్ రక్తంలో కలుస్తుంది. రక్తం దానిని శరీరంలోని ఇతర కణాలకు చేరవేస్తుంది. ఇక్కడ ఆల్కహాల్‌లోని పోషకాలు కరగకుండా అలాగే ఉంటాయి. తర్వాత ఇవి కాలేయానికి చేరుకుంటాయి. కాలేయం వీటిని ఫిల్టర్ చేసే పనిని ప్రారంభిస్తుంది. ఇంతలో ఆల్కహాల్ మెదడుకు చేరుకోవడంతో కొన్ని స్రవాలు విడుదల అవుతాయి. ఇవి మాట్లాడటం, నవ్వడం మొదలైన వాటిని నియంత్రిస్తాయి. అధిక బీర్ సేవించిన వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడుతూ, చేయడం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు ఒకటి కంటే ఎక్కువ బీర్లు తాగుతున్న వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అధికం ఎప్పుడైనా ప్రమాదమే.
కాలేయంపై ఆల్కహాల్ అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాలేయంలో కొవ్వు మొత్తం పెరిగి అది సరిగా పనిచేయలేకపోతుంది. ఆల్కహాల్ మానేసినప్పుడు లివర్ మళ్లీ రిపేర్ అవ్వడం మొదలవుతుంది, కాలేయ కణాలను ఏర్పాటు చేస్తుంది. కానీ కాలేయం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మునుపటిలా పనిచేయలేకపోతుంది కాబట్టి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.
మరిన్ని చదవండి ఇక్కడ : Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. 2,226 పోస్టులకు దరఖాస్తులు..(వీడియో)
VIP Tree Video: వీఐపీ చెట్టు.. 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ ఆ చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా..?(వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

