Tirupati: స్మశానం కబ్జా..మహిళ అంత్యక్రియలకు అడ్డంకి.. ఉద్రిక్తత వాతావరణం.. చివరికి ఎం జరిగింది..?(వీడియో)
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిట్టమీద కండ్రిగ గ్రామానికి చెందిన స్మశానం కబ్జా వ్యవహారం పై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామంలోని స్మశానాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు.
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిట్టమీద కండ్రిగ గ్రామానికి చెందిన స్మశానం కబ్జా వ్యవహారం పై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామంలోని స్మశానాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఓ మహిళ మృతదేహాన్ని ఖననం చేసేందుకు వెళ్లిన గ్రామస్తులను కబ్జాదారులు అడ్డుకున్నారు. స్మశానానికి ఫెన్సింగ్ వేసి లోపలకు వెళ్లనివ్వలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో స్మశాన స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆక్రమణకు గురైన స్మశాన స్థలాన్ని కాపాడకపోతే మృతదేహంతో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు స్థానికులు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Water in Theater: శివగంగ థియేటర్‌లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

