VIP Tree Video: వీఐపీ చెట్టు.. 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ ఆ చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా..?(వీడియో)

VIP Tree Video: వీఐపీ చెట్టు.. 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ ఆ చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా..?(వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 15, 2021 | 7:27 PM

చెట్టు విలువ ఏంటో తెలిసిన వారు.. చెట్లను అమితంగా ప్రేమిస్తారు. ఎవరైనా చెట్లకు హానీ చేస్తుంటే అస్సలు ఊరుకోరు. దానికి కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. తాజాగా మధ్య ప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని ఓ చెట్టుకు సంబంధించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

చెట్టు విలువ ఏంటో తెలిసిన వారు.. చెట్లను అమితంగా ప్రేమిస్తారు. ఎవరైనా చెట్లకు హానీ చేస్తుంటే అస్సలు ఊరుకోరు. దానికి కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. తాజాగా మధ్య ప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని ఓ చెట్టుకు సంబంధించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ చెట్టుకు సంబంధించిన వివరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇది కేవలం చెట్టు మాత్రమే కాదు. వీవీఐపీ కంటే ఎక్కువగా ఆదరింపబడుతోంది. అవునండీ బాబూ.. ఈ చెట్టుకు రక్షణగా 24 గంటలూ సెక్యూరిటీ గార్డులు ఉంటారు.
అంతేకాదు.. ఒక్క ఆకు రాలినా ఆ రోజు అధికారులకు కంటిమీద కునుకు ఉండదంటే నమ్మండి. ఇంతకీ అదేం చెట్టో చెప్పలేదు కదా?.. అది బోది చెట్టు. చరిత్రలో బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మితమైన సలామత్ కొండపైన ఈ బోధి చెట్టును నాటారు.. అది ఇప్పుడు 15 అడుగుల వరకూ పెరిగింది. ఈ చెట్టును రక్షించేందుకు ఐదుగురు భద్రతా సిబ్బంది నిరంతరం అక్కడ కాపలా ఉంటారు. ఇక ఈ చెట్టును ప్రతీ 15 రోజులకు ఒకసారి వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి.. దాని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేకాదు.. దీని మొత్తం నిర్వహణకు ప్రతి నెలా లక్షల రూపాయలు ఖర్చు అవుతోందట. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ బోధి వృక్షాన్ని సెప్టెంబర్ 21, 2012 సంవత్సరంలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స నాటారు. ఇది బౌద్ధమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చెట్టు గనుక.. దీనికి ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం.. బుద్దుడు బోధ్ గయలోని బోధి చెట్టు కిందే జ్ఞానోదయం పొందాడు. అశోక చక్రవర్తి కూడా బోధి చెట్టు కిందే ఆశ్రయం పొందాడు. అందుకే ఈ బోధి చెట్టుకు పటిష్టమైన భధ్రత ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. 15 అడుగుల ఎత్తులో ఉన్న ఈ చెట్టు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. దీనికి రక్షణగా ఎప్పుడూ ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ చెట్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 12 నుంచి 15 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుందట. కాగా, ఈ చెట్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారట. ప్రస్తుతం కరోనా కావడంతో.. పర్యాటకుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: ఇంటిని దోచుకుని, కలెక్టర్‌కు లేఖ రాసిన దొంగలు..! నెట్టింట వైరల్‌ అవుతున్న వార్త..(వీడియో)

 Tirupati: స్మశానం కబ్జా..మహిళ అంత్యక్రియలకు అడ్డంకి.. ఉద్రిక్తత వాతావరణం.. చివరికి ఎం జరిగింది..?(వీడియో)

 Water in Theater: శివగంగ థియేటర్‌లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..

 Gorilla in caretakers lap: సంరక్షుడి ఒడిలో ప్రాణాలొదిన సెలబ్రిటీ గొరిల్లా.. హృదయాలను కదిలిస్తున్న గొరిల్లా మరణం వీడియో..