Sekhar Kammula: ‘లీడర్’ సీక్వెల్‌లో రానా కాకుండా ఆ స్టార్ హీరోని అనుకుంటున్నారట.. ఇంతకు ఆయన ఎవరంటే..
సెన్సిబుల్ దర్శకుడిగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమకథలను.. సిన్నితమైన ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కిస్తారు శేఖర్ కమ్ముల.
Sekhar Kammula: సెన్సిబుల్ దర్శకుడిగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమకథలను.. సిన్నితమైన ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కిస్తారు శేఖర్ కమ్ముల. ఇటీవాలే లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు శేఖర్ కమ్ముల. సాయి పల్లవి, నాగచైతన్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెప్టెంబర్ 24 న రిలీజ్ అయిన లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే హిట్ టాక్ దూసుకుపోయింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. ఇదిలా ఉంటే ఇటీవల శేఖర్ కమ్ముల మాట్లాడుతూ లీడర్ సినిమాకు స్వీక్వెల్ తప్పకుండా తెరకెక్కిస్తానని అన్నారు. దగ్గుబాటి హీరో రానా నటించిన మొదటి సినిమా లీడర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన లీడర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు శేఖర్ కమ్ముల లీడర్ సీక్వెల్ ను ఓ స్టార్ హీరోతో చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లీడర్ సీక్వెల్ సినిమాను పవర్ స్టార్‌తో చేయనున్నారన్న వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. అంతే కాదు ఒక నాయకుడు నిజాయితీగా రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటీకే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు ఈ సినిమా మరింత మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారట. సినిమాను కూడా 2024 ఎన్నికల ముందు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే పవన్ భీమ్లానాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత శేఖర్ కమ్ముల సినిమా ఉండే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :