Rajeev Rayala | Edited By: Ravi Kiran
Updated on: Oct 16, 2021 | 6:52 AM
అంతకు ముందు ఆతర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఈషా రెబ్బా .
అతి తక్కువ కాలంలోనే ఈషా రెబ్బా టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలంగాణా పిల్ల ఈషా రెబ్బా కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
'బందిపోటు, అమీతుమీ' లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది.
నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా.. మలయాళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది ఈషా రెబ్బా. అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రాలేదు.