Trisha: డిజిటల్ పై సత్తా చాటేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్.. ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న త్రిష..
స్టార్ హీరోయిన్ త్రిష.. చాలా కాలం తర్వాత.. మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన
స్టార్ హీరోయిన్ త్రిష.. చాలా కాలం తర్వాత.. మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన త్రిష.. ఆ తర్వాత.. అనుహ్యాంగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు మరోసారి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వరుస ఆఫర్లతో తిరిగి పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవడానికి కసరత్తులు చేస్తుంది. తెలుగు, తమిళ్ భాషలలో స్టార్స్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిష.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఇప్పటివరకు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన త్రిష.. ఇప్పుడు డిజిటల్ పై సత్తా చాటేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఓ వెబ్ సీరిస్ చేయడానికి త్రిష ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం స్టార్ నటీనటులు డిజిటల్ ప్లాట్ ఫాం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విభిన్నమైన వెబ్ సిరీస్ చేసి.. ఓటీటీలో కూడా సక్సెస్ అయ్యారు తమన్నా, కాజల్.. తాజాగా త్రిష కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు. ఐదేళ్ళ తర్వాత.. టాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేదు. తాజాగా ఈ అమ్మడు బృంద అనే వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇటీవల ఓటీటీలోకి ఎంటర్ అయిన సోనీ లివ్ డిజిటల్ వేదికగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కసిస్తుందట. అలాగే దీనికి కొత్త డైరెక్టర్ సూర్య వంగల దర్శకత్వం వహించనున్నారట. ఈ వెబ్ సిరీస్.. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా రానుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సాయి కుమార్, ఆమని కీలకపాత్రలలో కనిపించనున్నారు.. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సిరీస్ కు నిర్మాతగా.. డిజైనర్ గా వ్యవహరించన్నారు. అలాగే శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Manchu Vishnu: ఈరోజే మంచు విష్ణు ప్రమాణ స్వీకారం.. ఆ ఇద్దరే ముఖ్య అతిథులు..
Sekhar Kammula: ‘లీడర్’ సీక్వెల్‌లో రానా కాకుండా ఆ స్టార్ హీరోని అనుకుంటున్నారట.. ఇంతకు ఆయన ఎవరంటే..