Varudu Kaavalenu: నయా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన నాగశౌర్య.. ‘వరుడు కావలెను’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
టాలీవుడ్ లో బిజీగా ఉన్న కుర్రహీరోల్లో నాగశౌర్య ఒకడు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ఆయా సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన శౌర్య.
Varudu Kaavalenu: టాలీవుడ్‌లో బిజీగా ఉన్న కుర్రహీరోల్లో నాగశౌర్య ఒకడు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే ఆయా సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన శౌర్య. ఆ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సొర్త్స్ బ్యాక్ డ్రాప్‌లో ఓ సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య. లక్ష్య అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కేక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే లేడీ దర్శకురాలు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
విజయదశమి కానుకగా వరుడు కావలెను సినిమా న్యూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తోపాటు హీరోహీరోయిన్లకు సంబంధించిన ఓ అందమైన పోస్టర్ ని వదిలారు. ఇందులో రీతూ వర్మ చేతులకు మెహందీ పెట్టుకుని కనిపించగా.. శౌర్య ఆమె చెవి దగ్గర మొబైల్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ – థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :