Heart Attack: గుండెపోటుకు శాశ్వత నివారణ ఇదే.. అమెరికన్ శాస్త్రవేత్తల కీలక ప్రకటన.. ఖర్చు ఎంతంటే?

Heart Attack: గుండెపోటుకు శాశ్వత నివారణ ఇదే.. అమెరికన్ శాస్త్రవేత్తల కీలక ప్రకటన.. ఖర్చు ఎంతంటే?
Heart Attack

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2019 లో సుమారు 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణించారు. అందులో 85% మంది గుండెపోటు, స్ట్రోక్ కారణంగా మరణించారు.

Venkata Chari

|

May 11, 2022 | 8:50 PM

గుండెపోటు(Heart Attack)తో ఎందరో మరణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మరణాలకు అతిపెద్ద కారణంగా నిలుస్తోంది. మార్కెట్లో లభించే ఇంజెక్షన్లు, మందులు శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. కానీ, గుండెపోటు నుంచి రోగిని కచ్చితంగా రక్షించలేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారాన్ని US బయోటెక్ కంపెనీ వెర్వ్ థెరప్యూటిక్స్ కనుగొంది. ఒక వ్యక్తి డీఎన్‌ఏను మార్చడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించవచ్చని బ్లూమ్‌బెర్గ్‌తో జరిగిన సంభాషణలో కంపెనీ సీఈఓ డాక్టర్ శేఖర్ కతిరేసన్ తెలిపారు. గుండెపోటుకు ఇది శాశ్వత పరిష్కారంగా ఆయన పేర్కొ్న్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2019 లో సుమారు 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణించారు. అందులో 85% మంది గుండెపోటు, స్ట్రోక్ కారణంగా మరణించారు.

Also Read: Spinach Benefits: రక్తహీనత వేధిస్తుందా.. అయితే బచ్చలి కూరతో ఈ సమస్యకు చెక్‌ పెట్టండి..

గుండెపోటుతో బాధపడుతున్న రోగులపై పరిశోధనలు..

వెర్వ్ థెరప్యూటిక్స్ ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండెపోటు వచ్చిన వ్యక్తులపై మొదట DNA ను సవరించే సాంకేతికత ప్రయోగించనున్నారు. ఇది హైపర్ కొలెస్టెరోలేమియా అనే జన్యుపరమైన వ్యాధి. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 31 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఈ సాంకేతికత విజయవంతమైతే, ఎంతోమందికి మేలు జరుగుతుంది. ఈ పరిశోధనలో యువకులలో గుండెపోటు వచ్చే అవకాశాలను గుర్తించడంతో ముందే రక్షించేందుకు వీలుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఎలాంటి సమాచారం మాత్రం ఇవ్వలేదు.

మానవ DNAలో మార్పులు..

డాక్టర్ కతిరేసన్ హార్వర్డ్‌కు చెందిన ప్రఖ్యాత జన్యు శాస్త్రవేత్త, కార్డియాలజిస్ట్. ఇటువంటి జన్యు ఉత్పరివర్తనాలను కనుగొనేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. దీని సహాయంతో శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. ప్రస్తుతం వారు కొలెస్ట్రాల్‌ను పెంచే జన్యువుల పనితీరును తగ్గించడంపై తమ పరిశోధనలను కేంద్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం, వెర్వ్ థెరప్యూటిక్స్ మానవ DNAలోని రెండు జన్యువులను లక్ష్యంగా చేసుకునే రెండు ఔషధాలను అభివృద్ధి చేస్తోంది. ఆ జన్యు పేర్లు PCSK9, ANGPTL3గా గుర్తించారు. కొంతమంది రోగులకు ఈ మందులలో ఒకటి మాత్రమే అవసరం అయితే, కొందరికి రెండు ఔషధాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కంపెనీ Crispr DNA ఎడిటింగ్ టూల్‌ని ఇందుకోసం ఉపయోగిస్తోంది. దీని ద్వారా, శాస్త్రవేత్తలు మానవుల జన్యు క్రమాన్ని సులభంగా మార్చవచ్చు.

కోతులపైనా ప్రయోగాలు..

వెర్వ్ థెరప్యూటిక్స్ ప్రకారం, ఈ చికిత్స కోసం కోతులపై ట్రయల్స్ జరుగుతున్నాయి. 2 వారాల్లోపు DNA సవరించిన తర్వాత, కొలెస్ట్రాల్ స్థాయి 59% తగ్గింది. తదుపరి 6 నెలల వరకు అదే స్థాయిలో ఉంది. కొన్ని నెలల్లో మానవులపై ఈ చికిత్సను కంపెనీ ట్రయల్ ప్రారంభించనుంది. అయితే, డ్రగ్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందడానికి సంవత్సరాలు పట్టవచ్చని తెలుస్తోంది.

అనేక సవాళ్లు..

వెర్వ్ థెరప్యూటిక్స్ ఉపయోగిస్తున్న సాంకేతికత చాలా కొత్తదని, వైద్యులు, రోగులు దీనిని స్వీకరించడానికి ఇష్టపడరని ఆరోగ్య నిపుణుడు ఎలిజబెత్ మెక్‌నీలీ చెప్పారు. దీని వల్ల డీఎన్‌ఏలో ఎలాంటి భంగం వాటిల్లుతుందేమోనన్న భయం ప్రజల మనసుల్లో ఉండవచ్చు. అదే సమయంలో, మైఖేల్ షెర్మాన్ తన చికిత్స సురక్షితమని కంపెనీ నిరూపించినప్పటికీ, ఇప్పటికే ఉన్న మందుల కంటే ఇది చాలా ఖరీదైనదని చెప్పుకొచ్చారు.

ఈ DNA పునఃస్థాపన చికిత్స ఖర్చు రోగికి $50,000 నుంచి $200,000(సుమారు రూ.38 లక్షల నుంచి రూ.1 కోటి 54 లక్షలు) వరకు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెర్వ్ థెరప్యూటిక్స్ ఆల్ఫాబెట్ కంపెనీకి చెందిన క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగమైన గూగుల్ వెంచర్స్ ద్వారా మద్దతునిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బందిపడుతున్నారా ?.. అయితే ఈ పద్ధతులను పాటిస్తే క్షణాల్లో ఉపశమనం..

Coconut Milk Tea: కొబ్బరి పాలతో తయారు చేసిన టీ ఎప్పుడైనా తాగారా? మీ చర్మ కాంతి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu