AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irregular Periods: పీరియడ్స్ ఆలస్యమవుతున్నాయా? ఈ ఫుడ్స్ & టిప్స్‌తో రెగ్యులర్ చేసుకోండి!

మహిళల్లో పీరియడ్స్ ఆలస్యం అవ్వడం సాధారణ సమస్య. లైఫ్‌స్టైల్ మార్పులు, ఒత్తిడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, PCOS, థైరాయిడ్, బరువులో హెచ్చుతగ్గులు వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. సాధారణ మెన్‌స్ట్రువల్ సైకిల్ 21-35 రోజులు ఉండాలి. ఇది దాటితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు.

Irregular Periods: పీరియడ్స్ ఆలస్యమవుతున్నాయా? ఈ ఫుడ్స్ & టిప్స్‌తో రెగ్యులర్ చేసుకోండి!
Irregular Periods
Nikhil
|

Updated on: Nov 13, 2025 | 7:34 AM

Share

మహిళల్లో పీరియడ్స్ ఆలస్యం అవ్వడం సాధారణ సమస్య. లైఫ్‌స్టైల్ మార్పులు, ఒత్తిడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, PCOS, థైరాయిడ్, బరువులో హెచ్చుతగ్గులు వంటి కారణాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. సాధారణ మెన్‌స్ట్రువల్ సైకిల్ 21-35 రోజులు ఉండాలి. ఇది దాటితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. పెళ్లి, ట్రిప్, ఫంక్షన్ సమయాల్లో ఇలా జరిగితే ఇబ్బంది, ప్రెగ్నెన్సీ ఆందోళన పెరుగుతాయి. అయితే, సింపుల్ హోమ్ రెమెడీస్, డైట్ మార్పులతో పీరియడ్స్​ని రెగ్యులర్ చేయవచ్చు. రోజూవారి ఆహారంలో కొన్నింటిని చేర్చుకోవడం వల్ల పీరియడ్స్​ రెగ్యులర్​ అవుతాయి.. ఆ ఆహారపదార్థాలేంటో తెలుసుకుందాం..

పసుపు పాలు

ఆయుర్వేదంలో ఈ రెమిడీ చాలా ప్రసిద్ధి. పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు గర్భాశయ రక్త ప్రసరణ పెంచుతాయి. ప్రతిరోజూ రాత్రి గ్లాసు పాలలో చెంచా పసుపు మరిగించి, తేనె కలిపి గోరువెచ్చగా తాగాలి. కడుపు నొప్పి తగ్గుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి.

అల్లం & దాల్చిన చెక్క

అల్లంలో విటమిన్ C, మెగ్నీషియం ఉండి హార్మోన్స్ నియంత్రిస్తాయి. ఉదయాన్నే పచ్చి అల్లాన్ని తేనెతో కలిపి తినాలి. దాల్చిన చెక్కలోని గుణాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. పాలలో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే PCOS సమస్యలు తగ్గుతాయి.

బొప్పాయి & పైనాపిల్

పచ్చి బొప్పాయి విటమిన్ Cతో గర్భాశయ కండరాలు సంకోచిస్తాయి. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ లోపలి పొరను స్టిములేట్ చేసి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పైనాపిల్​ని రోజూ తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

అలోవెరా జెల్

అలోవెరా జెల్‌ను తేనెతో కలిపి ఉదయాన్నే పరగడపున తీసుకోవాలి. ఇది హార్మోనల్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో మాత్రం దీన్ని తీసుకోవడం ఆపేయాలి.

ఆహారంలో తగిన మార్పులు చేసుకుంటూనే ఒత్తిడి తగ్గించుకోవాలి, యోగా, మెడిటేషన్ చేయాలి. రోజూ 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. వాల్నట్స్, అవిసెలు (ఒమేగా-3 రిచ్) వంటి ఆహారాల్ని రోజూ తీసుకోవాలి. వీటిని రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వీటితోపాటు బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

నోట్: ఇందులో అందించిన సమాచారం, పరిష్కారాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. వాటిని అనుసరించే ముందు దయచేసి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో