AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికొన్ని గంటల్లో TG PGECET 2026 ఫలితాలు.. పరీక్షలు ముగిసిన 4 రోజుల్లోనే రిజల్ట్స్! డైరెక్ట్ లింక్ ఇదిగో

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్, ఫార్మసీ, సివిల్, ఈసీఈ, మెకానికల్ తదితర పీజీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్, ఫార్మ్-డీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET 2026 ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా స్కోర్ కార్డు..

మరికొన్ని గంటల్లో TG PGECET 2026 ఫలితాలు.. పరీక్షలు ముగిసిన 4 రోజుల్లోనే రిజల్ట్స్! డైరెక్ట్ లింక్ ఇదిగో
TG PGECET Results
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 5:07 PM

Share

హైదరాబాద్‌, జూన్ 4: తెలంగాణలో పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET 2026 పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 5, శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ విజిటర్స్ లాంజ్‌లో రేపు మధ్యాహ్నం 03:30 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి మరియు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

Also Readపులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్‌ విసిరే చిక్కు ప్రశ్న

మధ్యాహ్నం 3:15 గంటలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్, ఫార్మసీ, సివిల్, ఈసీఈ, మెకానికల్ తదితర పీజీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్, ఫార్మ్-డీ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 26,005 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీజీ పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు జూన్‌ 1తో ముగిసిన సంగతి తెలిసిందే. మే 29న ప్రారంభమైన ఈ పరీక్షలు 4 రోజులపాటు ఆన్‌లైన్‌ విధానంలో రోజూ రెండు సెషన్లలో జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,077 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 23,637 మంది (90.64 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో ఫలితాలను కేవలం 4 రోజుల వ్యవధిలోనే విడుదల చేస్తున్నారు.

టీజీ పీజీఈసెట్‌ 2026 ఫలితాల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా