Rheumatoid Arthritis : కీళ్ళ అరుగుదల… మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా.. మీకు బెస్ట్ మెడిసిన్ బచ్చలి

ప్రస్తుత కాలంలో వయసుతో పనిలేకుండా ఎవరైనా కీళ్లనొప్పుల బారిన పడవచ్చు. 30ఏళ్లకే కీళ్ల నిప్పుల బారిన పడేవారు ఎందరో ఉన్నారు. ఇందు ముఖ్య కారణం.. జీవన విధానంలో అనేక మార్పులు..

Rheumatoid Arthritis : కీళ్ళ అరుగుదల... మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా.. మీకు బెస్ట్ మెడిసిన్ బచ్చలి
Follow us
Surya Kala

|

Updated on: Feb 27, 2021 | 6:58 PM

Arthritis Pain : ప్రస్తుత కాలంలో వయసుతో పనిలేకుండా ఎవరైనా కీళ్లనొప్పుల బారిన పడవచ్చు. 30ఏళ్లకే కీళ్ల నిప్పుల బారిన పడేవారు ఎందరో ఉన్నారు. ఇందు ముఖ్య కారణం.. జీవన విధానంలో అనేక మార్పులు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం వంటివి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక దినచర్యలో సరైన వ్యాయామం లేకపోవడం.. సరియైన సమయంలో నిద్రపోకపోవడం వంటివి కూడా కీళ్ల నొప్పులకు కారణాలుగా చెప్పవచ్చు, ఇక మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కీళ్ళ అరుగుదలను ఆర్థ్రయిటిస్ అంటారు. ఇది చాలా తీవ్రమైన అరోగ్య సమస్య. ఆర్థ్రయిటిస్‌తో బాధపడుతున్న వాళ్ళు కు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థ్రయిటిస్‌తో బాధపడుతున్న వాళ్ళల్లో కేవలం 15-20 శాతానికి మాత్రమే కీళ్ళ మార్పిడి అవసరం అవుతోంది. మిగతా 50 మందికి రిపేర్ చేయడంవల్ల, జాయింట్స్ తిరిగి పెంచడంవల్ల సరిచేయవచ్చు. ఆర్థ్రయిటిస్ అంటే కీళ్ళలో ఇన్‌ఫెక్షన్, మన కీళ్ళని కార్టిలేజ్ పొరతో రక్షింపబడుతుంటాయి. ఈ కార్టిలెజ్ పొర కొబ్బరికాయలోని కొబ్బరిపొరలాగా మెత్తగా, తెల్లగా వుంటుంది. ఎప్పుడైతే ఈ పొర దెబ్బతింటుందో, అపుడు నొప్పి, కాళ్ళలో నడకలో మార్పు వచ్చి, ఆర్థ్రయిటిస్‌కి దారితీస్తుంది.
సాధారణంగా కనిపించే ఆర్థ్రయిటిస్‌లోని రకం ఆస్టియో ఆర్థ్రయిటిస్. ఇది మోకాలు కీళ్ళలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. మోకాలు కీళ్ళలో వచ్చే ఆర్థ్రయిటిస్‌వల్ల ఈ నొప్పి, కదలికలలో ఇబ్బందులు, సరిగ్గా నడవలేకపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇలా 15-20 శాతం మంది బాధపడుతున్న వారు  కీళ్ళ మార్పిడికి వెళ్లుతున్నారు. మిగతా 50 మందికి రిపేర్ చేయడంవల్ల, జాయింట్స్ తిరిగి పెంచడంవల్ల సరిచేసుకుంటున్నారు. 2025 నాటికి మనదేశంలోనే ఈ వ్యాధి బాధితుల సంఖ్య 6కోట్లకు చేరుతుందని ఓ సర్వే రిపోర్టు చెబుతోంది. దీనికి రిప్లేస్ మెంట్ చేసిన…నొప్పి నివారించడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకున్న ఫ్యుచర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా లఖ్‌నవూలోని సెంట్రల్‌ డ్రగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ రీసెర్చ్ చేసింది. వీటికి మనం నిత్యం వాడే ఆకు కూరల్లో ఉన్నట్టు సైంటిస్టులు  తెలిపారు.
మోకాళ్ల నొప్పులకు అద్భుతమైన నివారిణి బచ్చలికూర అని సైంటిస్టులు తేల్చారు. బచ్చలి కూరలో  ఎక్కువ శాతం ఐరన్‌ ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతోన్న రోగులు బచ్చలిని 3.5 మి.గ్రా  మోతాదులో తిన్నే ఆహారంలో తీసుకుంటే మేలు కల్గుతుందని.. మంచి ఫలితం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. అందుకే వాళ్లు ఆ ఆకుల్లోని సారాన్ని నానోపార్టికల్స్‌ రూపంలో సేకరించి, మెడిసిన్ తయారుచేశారు.  ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో వచ్చింది.  దీంతో బచ్చలికూరకు బాగా డిమాండ్ పెరిగే అవకావం ఉంది.