Baba Ramdev: వ్యవసాయ చట్టాలను మూడేళ్ల వరకు నిలిపివేయాలి.. బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయ చట్టాలను మూడేళ్ల వరకు నిలిపివేయడం ద్వారా రైతుల నిరసనల పరిస్థితిని పరిష్కరించాలని యోగా గురు బాబా రామ్‌దేవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Baba Ramdev: వ్యవసాయ చట్టాలను మూడేళ్ల వరకు నిలిపివేయాలి.. బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Feb 27, 2021 | 6:29 PM

Baba Ramdev:  వ్యవసాయ చట్టాలను మూడేళ్ల వరకు నిలిపివేయడం ద్వారా రైతుల నిరసనల పరిస్థితిని పరిష్కరించాలని యోగా గురు బాబా రామ్‌దేవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు, కేంద్రానికి మధ్య శాంతి కలగాలని మాత్రమే కోరుకుంటున్నాను అన్నారు. హర్యానాలోని సమల్కాలో జరిగిన ఒక వ్యాపారవేత్త వివాహానికి హాజరైన బాబా రామ్‌దేవ్ కొనసాగుతున్న రైతుల నిరసనల గురించి మాట్లాడారు. తాను ప్రభుత్వ ప్రతినిధిగా లేదా కాంట్రాక్టు రైతుగా ఉండాలని భావించడం లేదని, అయితే ఈ విషయం ఒక కొలిక్కి రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలను మూడేళ్లపాటు వాయిదా వేయాలని, రైతులు ప్రభుత్వంతో కూర్చుని దేశ ప్రయోజనాల విధానాలపై చర్చించాలని రామ్‌దేవ్ బాబా ఇరు వర్గాలను కోరారు. ప్రభుత్వం లేదా రైతులు స్థిరపడటానికి సిద్ధంగా లేరని, అయితే ఈ ప్రతిష్టంభన ముగుంపు వెతకాలని ఆయన సూచించారు. 

ఈ చట్టాలను ఏడాదిన్నర కాలం నిలిపివేయడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రామ్‌దేవ్ అన్నారు. ఇది తగినంత సమయం కాదని రైతులు భావిస్తే, కేంద్రం దానిని మూడేళ్లకు పెంచాలని కోరారు. ఈ సమయంలో  రైతులు, ప్రభుత్వం కలిసి కూర్చుని వ్యవసాయం, దేశం గురించి చర్చించి సరైన వాటిపై చట్టాలు రూపొందించాలి. కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  

ఇప్పటికి 12 సార్లు చర్చలు:

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఉద్యమం కొనసాగుతోంది. ఈ తరుణంలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన సాగు చట్టాల విషయం సుప్రీం కోర్టులో ఉన్నందున ప్రస్తుతం వాటిని అమలు చేయలేకపోతున్నామని వెల్లడించారు. రైతులతో ఇప్పటివరకు 12సార్లు చర్చలు జరిగాయని.. ఇప్పటికీ చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ఇప్పటికి రైతు సంఘాలతో 12 రౌండ్ల చర్చలు జరిగాయని గుర్తుచేశారు. నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయం సుప్రీంలో ఉన్నందున ప్రస్తుతం అమలు చేయలేమని తెలిపారు. సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇప్పటి వరకూ తన అభిప్రాయాలను సమర్పించలేదని.. ఇంకా అభిప్రాయాల సేకరణ జరుగుతుందని తెలిపారు.

కాగా.. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు జరిగిన 12 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జనవరి 22న చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో చట్టాలను రద్దు చేసి, పంటలకు కనీస మద్దుతు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలకు మాత్రమే తాము సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.  దీంతో ప్రతీసారి జరిగిన చర్చలు విఫలమవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

Also Read:

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త

Co-WIN 2.0: కరోనా టీకా కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ అవసరం? పూర్తి వివరాలు మీ కోసం