5 Necessary Diet Changes : 50 ఏళ్లకు చేరువైన మహిళలు తినే ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే
50ఏళ్ళ కు చేరువైన తర్వాత మహిళలు అనేక శారీరక మార్పులకు లోనవుతారు. దీంతో రోజు తినే ఆహారంలో అనేక మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. వయసుతో పనిలేకుండా సంతోషంగా మానసికంగా, శారీరకంగా...
5 Necessary Diet Changes : 50ఏళ్ళ కు చేరువైన తర్వాత మహిళలు అనేక శారీరక మార్పులకు లోనవుతారు. దీంతో రోజు తినే ఆహారంలో అనేక మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. వయసుతో పనిలేకుండా సంతోషంగా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి 50 ఏళ్లు పైబడిన మహిళలు 5 ముఖ్యమైన ఆహార మార్పులను చేసుకోవాలి ..
1. 50ఏళ్ళు వచ్చిన ప్రతి మహిళ తినే ఆహారంలో చేయవలసిన కొన్ని మార్పులు:
వయసు పెరిగే కొద్దీ.. స్త్రీ శరీరంలో బాహ్య, అంతర్గత మార్పులు అనేకం చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా 50 ఏళ్ళ వయసు చేరుకున్న మహిళల్లో మైనోపాజ్ దశకు చేరువ అవుతారు. దీంతో జీవ క్రియ తగ్గుతుంది. ఇక కండర ద్రవ్యరాశిని కోల్పోతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కనుక ఆరోగ్య సమస్యలను దరి చేరకుండా మహిళలు వారి శారీరక అవసరాలకు తగినట్లు ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఈ దశలోని మహిళలు తినే ఆహారం వారి చర్మం , శరీరం తీరును ప్రతిబింబించే విధంగా ఉండాలి. అందుకనే 50ఏళ్ళు వచ్చిన మహిళ తినే ఆహారం ఎంపిక చాలా ముఖ్యం. 50ఏళ్ళు వచ్చిన ప్రతి స్త్రీ తినే ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులను గురించి ఈరోజు తెలుసుకుందాం..!
2 కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రోటీన్
సహజంగానే వృద్ధాప్యం ఛాయలు వచ్చేసరికి మనిషి తన కండర ద్రవ్యరాశిని కోల్పోతాడు. ఇక ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి పదేళ్లకు కండర ద్రవ్యరాశి సుమారు 3 నుండి 8 శాతం తగ్గుతుందని .. అలా 60 సంవత్సరాలకు చేరుకునే సరికి ఈ కండర ద్రవ్యరాశి క్షీణత రేటు గణనీయంగా పెరుగుతుందని డేటా సూచిస్తుంది. ముఖ్యంగా మహిళలు 80 సంవత్సరాలకు చేరుకునే సరికి వారిలో కండర ద్రవ్యరాశి సగానికి పైగా కోల్పోవచ్చు. దీనికి ప్రధాన కారణం శారీరక శ్రమ తక్కువ తో పాటు తక్కువ ప్రోటీన్ తీసుకోవడం. కనుక 50 ఏళ్ళకు చేరుకున్న స్త్రీ ఎక్కువ ప్రోటీన్‌ను ఆహారంలో చెర్చుకోవాలి. అప్పుడు కండర ద్రవ్యరాశి కోల్పోకుండా చేస్తుంది. అందుకనే 50 ఏళ్లు పైబడిన మహిళలు కిలోగ్రాము బరువుకు 1 నుండి 1.5 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
03 ఎముక ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియ పదార్ధాలను తీసుకోవాలి
వయసు పెరిగే కొద్దీ మన ఎముక సాంద్రత క్షీణిస్తుంది. దీంతో ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాల్షియం తగ్గువ అయితే ఎముకల్లో ఈస్ట్రోజెన్ (ఎముకలను రక్షించే హార్మోన్) స్థాయి పడిపోతుంది. దీంతో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా బోలు ఎముకల వ్యాధి కి గురయ్యే అవకాశం ఉంది. ఇది మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో మరింత అధికం. కనుక 40 ఏళ్ళు దాటిన స్త్రీ ఎముక ఆరోగ్యం కోసం కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం. 50 మరియు అంతకంటే తక్కువ వయస్సు గల మహిళలకు, రోజువారీ కనీస కాల్షియం అవసరం రోజుకు 1,000 మిల్లీగ్రాములు (mg), 50 ఏళ్లు పైబడిన వారికి ఇది 1,200మిల్లీగ్రాములు అవసరం
4 వయసు పెరిగే కొద్దీ సోడియం తీసుకోవడం తగ్గించాలి
డైనింగ్ టేబుల్‌పై ప్రతిసారీ మీ ఆహారం పైన కొంచెం ఉప్పును చల్లుకునే అలవాటు మీకుంటే.. అది అనర్ధానికి కారణమని హెచ్చరిస్తున్నారు. కనుక ఈ అలవాటును తగ్గించుకోవాలి. అధిక సోడియం తీసుకుంటే.. గుండె పోటుకు , రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక పెద్దవారు రోజు సోడియం స్థాయిని 1,500 మి.గ్రా మించరాదని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ఆహారం టేస్టీ కోసం ఉప్పుకు బదులుగా.. ఇతర మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు.
05 మెదడు పనితీరుకు విటమిన్ బి 12
వృద్ధాప్యం మెదడు పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యల బారిన 50 ఏళ్లు పైబడిన వారు పడుతూ ఉంటారు. అందుకనే మెదడు యొక్క పనితీరు కోసం, విటమిన్ బి 12 ను ఆహారంలో చేర్చడం తప్పనిసరి. జంతువుల ఆధారిత ఆహార ఉత్పత్తులలో బి 12 ఎక్కువగా ఉంటుంది. కనుక శాఖాహారులు బి 12 దొరికే సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చు. ఈ . విటమిన్ బి 12 ను శరీరంలో కొన్నేళ్లుగా నిల్వ చేసుకునే విధంగా శరీర నిర్మాణం ఉంది. 50 ఏళ్లు పైబడిన మహిళలు విటమిన్ బి -12 ను రోజుకు 2.4 మైక్రోగ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది.
06 మంచి ఆరోగ్యానికి విటమిన్ డి
అన్ని ఏజ్ గ్రూప్ ల వారికి సర్వసాధారణంగా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఈ విటమిన్ సూర్యకాంతి నుంచి సమృద్ధిగా లభ్యమవుతుంది. అయినప్పటికీ ఈ ముఖ్యమైన పోషకం లోపం కలిగిన ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ విటమిన్ శరీరం యొక్క అనేక అంతర్గత పనులలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, అంతేకాదు 50 ఏళ్లు పైబడిన మహిళలకు విటమిన్ డి అత్యవసరం. ఇది గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి, డయాబెటిస్, క్యాన్సర్ మరియు బరువు పెరగడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. 50 ఏళ్లు పైబడిన మహిళలకు విటమిన్ డి కనీస రోజువారీ అవసరం 600 IU మరియు 70 ఏళ్లు పైబడిన వారికి 800 IU కావాల్సి ఉంది.
Also Read: