Shaik Madar Saheb |
Updated on: Feb 27, 2021 | 3:28 PM
చాలామంది చీటికిమాటికీ గొళ్లు కొరుకుతుంటారు. కొందరు టెన్షన్‌లో ఉన్నప్పుడు.. మరికొందరు ఆనందంలో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు.
ఈ అలవాటు మంచిది కాదంటూ పెద్దవాళ్లు చెప్పినా... చాలామంది పట్టించుకోరు. అయితే గోళ్లు కొరకడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ అలవాటు బాల్యంలో ఎక్కువగా ఉంటుంది. ఇదే అలవాటు క్రమేణా వ్యాపిస్తుందని పేర్కొంటన్నారు. దీనిని వైద్య పరిభాషలో ఒనికోఫాగియా అంటారు.
గోళ్లను కొరకడం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా, క్రీములు వేళ్ల ద్వారా నోటిలోకి వెళతాయి. దీనివల్ల కడుపు, పేగులో ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు. దీనివల్ల వేళ్లచివరి చర్మం దెబ్బతిని.. గోళ్ల చుట్టూ పుండ్లు ఏర్పడతాయి.
ఈ అలవాటు మానుకోవాలంటే ప్రధానంగా చేయాల్సింది గోళ్లను కొరకకూడదని మనసులో అనుకోవడం.. గ్లౌజులు తొడగడం మంచిదని సలహాలు ఇస్తున్నారు.