AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు కారణమేంటి..? దీని నుంచి బయటపడటం ఎలా..?

శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలను బయటికి పంపడంతో పాటు ఎన్నో ముఖ్య పనులను నిర్వర్తిస్తుంది కాలేయం. ప్రోటీన్స్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్‌ని జీవక్రియ చేసి, గ్లైకోజెన్, విటమిన్స్‌, ఖనిజాలను నిల్వ చేస్తుంది. అందుకే, ఎప్పటికప్పుడు లివర్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే లివర్‌కి వచ్చే సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. కాలేయంలో కొవ్వు శాతం కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. దీనిలో కూడా రెండు రకాలు ఉన్నారు

Health: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు కారణమేంటి..? దీని నుంచి బయటపడటం ఎలా..?
Fatty Liver Disease
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2024 | 3:20 PM

Share

భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో, ఈ వ్యాధి కాలేయ సిర్రోసిస్, దీర్ఘకాలిక కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఆల్కహాల్, స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మద్యం సేవించని వారు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారని తేలింది. ఈ రకమైన వ్యాధిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అటువంటి పరిస్థితిలో, మద్యం సేవించని వ్యక్తులు కొవ్వు కాలేయ వ్యాధి బారిన ఎందుకు పడుతున్నారు అన్నది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ పేలవమైన జీవనశైలి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ అనేది ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారిలో వస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారికి  కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది.  WHO నివేదిక ప్రకారం, అమెరికా జనాభాలో 25 శాతం మందికి నాన్ ఆల్కహాలిక్ వ్యాధి ఉంది. భారతదేశంలో కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్, వ్యాయామం లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని గుర్తుంచుకోవాలి.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా తగ్గించాలని ఢిల్లీలోని ఎయిమ్స్ డా. నీరజ్ కుమార్ చెప్పారు. దీని కోసం, ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలని.. జీవనశైలిని చక్కగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేయాలని.. పుష్కలంగా నీరు త్రాగాలని నిపుణులు చెబుతున్నారు.  పసుపు, గోరువెచ్చని నీరు కలుపుకుని తాగడం లేదా పసుపు, తేనె కలుపుకుని తీసుకోవడం, పసుపు, నారింజ తొక్క కలిపి తీసుకోవడం ద్వారా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌‌కు చెక్ పెట్టవచ్చు.

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. మీకు ఏ సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి