మైగ్రేన్ అటాక్.. ఈ నొప్పికి శాశ్వత పరిష్కారం ఉందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదు. ఇది ఒక దీర్ఘకాల న్యూరోలాజికల్ సమస్య. తరచూ వచ్చే మైగ్రేన్ నొప్పి జీవనశైలిని పూర్తిగా దెబ్బతీస్తుంది. టెన్షన్, హార్మోనల్ మార్పులు, సరైన ఆహారం లేకపోవడం వంటి కారణాలు దీని వెనుక ఉంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మైగ్రేన్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

మైగ్రేన్ అనేది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. వయసు, లింగంతో సంబంధం లేకుండా వస్తున్నా.. ముఖ్యంగా మహిళల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. టెన్షన్, పని ఒత్తిడి, సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. NHS UK పరిశోధన ప్రకారం.. మైగ్రేన్ ఒక లాంగ్ టర్మ్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్.
మైగ్రేన్ లక్షణాలు
మైగ్రేన్ హెడేక్ మైల్డ్‌గా లేదా చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఇది తరచుగా వస్తుంది. ఈ పెయిన్ నుదిటిలో భరించలేనిదిగా స్టార్ట్ అవుతుంది. చాలా మందికి దీనితో పాటు వాంతులు, వాంతులు అవుతున్న ఫీలింగ్ వస్తాయి. ప్రపంచ జనాభాలో సుమారు 15 శాతం మందికి వారి లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి మైగ్రేన్ వస్తుందని స్టడీస్ చెబుతున్నాయి.
ఈ నొప్పి సాధారణంగా తల ఒక వైపు ఉంటుంది. కొందరికి రెండు వైపులా కూడా రావచ్చు. హెడేక్ రెండు గంటల నుండి 72 గంటల వరకు ఉంటుంది. అలాగే లైట్, సౌండ్, వాసనలు అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మైగ్రేన్ వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మహిళల్లో పురుషుల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా మైగ్రేన్ కనిపిస్తుంది.
మైగ్రేన్ నివారణ మార్గాలు
- లావెండర్ ఆయిల్.. దీన్ని డైరెక్ట్‌గా పీల్చడం లేదా వేరే నూనెలో కలిపి వాడితే పెయిన్ తగ్గుతుంది.
- అక్యుపంక్చర్.. స్కిన్‌లోని కొన్ని పాయింట్స్‌లో నీడిల్స్ పెట్టడం వల్ల నొప్పి నుండి రిలీఫ్ లభిస్తుంది.
- అల్లం.. ఆయుర్వేదంలో అల్లానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మైగ్రేన్‌కు కూడా ఇది యూజ్ అవుతుంది.
- యోగా.. యోగా చేయడం వల్ల మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది యాంగ్జైటీని తగ్గిస్తుంది. గుండె హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే మైగ్రేన్ ఉన్న చోట ప్రెజర్‌ను తగ్గిస్తుంది.
- మైగ్రేన్‌ను చిన్న సమస్యగా అస్సలు అనుకోవద్దు. సరైన కేర్ తీసుకుంటే దీని ఎఫెక్ట్‌ను తగ్గించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




