AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైట్ తీసుకోవద్దు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ ఉన్నట్లే..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం మంచిది.. అలాంటి అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి.. ఇది చాలా మందిని వేధిస్తుంటుంది.. వాస్తవానికి థైరాయిడ్ వ్యాధి లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తాయి. రోగి శరీరంలో కొవ్వు పెరగడం.. లేదా బరువు తగ్గడం ప్రారంభమవడం థైరాయిడ్ లక్షణాలే..

లైట్ తీసుకోవద్దు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ ఉన్నట్లే..
Thyroid symptoms
Shaik Madar Saheb
|

Updated on: Sep 03, 2025 | 9:15 AM

Share

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం మంచిది.. అలాంటి అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి.. ఇది చాలా మందిని వేధిస్తుంటుంది.. వాస్తవానికి థైరాయిడ్ వ్యాధి లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తాయి. రోగి శరీరంలో కొవ్వు పెరగడం.. లేదా బరువు తగ్గడం ప్రారంభమవడం థైరాయిడ్ లక్షణాలే.. ఇది కాకుండా, గొంతులో వాపు కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలను అశ్రద్ధ చేయకూడదని వెంటనే.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని పరిమాణం తగ్గడం రెండూ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. వీటికి సకాలంలో చికిత్స చేయకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుంది.. ఒక్కోసారి పరిస్థితి తీవ్రమైనదిగా మారొచ్చు..

థైరాయిడ్ వ్యాధి అంటే..

మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. దీనిలో హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ చర్య) లేదా హైపర్ థైరాయిడిజం (అధిక థైరాయిడ్ చర్య)గా వైద్య నిపుణులు అంచనావేస్తారు.. రెండు సందర్భాలలోనూ లక్షణాలు కనిపిస్తాయి. అయితే, చాలా థైరాయిడ్ కేసులను మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరం అవుతుందంటున్నారు. వైద్య నిపుణులు..

థైరాయిడ్ గ్రంథి మన మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి. ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ గ్రంథి థైరాక్సిన్ (T4), ట్రైఅయోడోథైరోనిన్ (T3) వంటి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసి విడుదల చేయడానికి పనిచేస్తుంది. శరీరానికి ఈ రెండు హార్మోన్లు కూడా అవసరం.

థైరాయిడ్ హార్మోన్ల ప్రధాన విధులు ఏంటంటే.. జీవక్రియ వేగాన్ని నియంత్రించడం, ఆహారాన్ని శక్తిగా మార్చడం.. దీనిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే, మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. థైరాయిడ్ వ్యాధి హైపోథైరాయిడిజం (థైరాయిడ్ తక్కువ చురుకుదనం) లేదా హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ అధిక చురుకుదనం) కు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు..

థైరాయిడ్ లక్షణాలు:

థైరాయిడ్ అధికంగా ఉండటం, లోపం రెండూ వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి.

అలసట, నీరసం, బరువు పెరగడం, విపరీతమైన చలి.. లేదా చలిని తట్టుకోలేకపోవడం, నిరాశ, మలబద్ధకం హైపోథైరాయిడిజం సాధారణ లక్షణాలు.

హైపర్ థైరాయిడిజం వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, బరువు తగ్గడం, ఆందోళన, చిరాకు, విరేచనాలు, అధిక చెమట, వేడిని తట్టుకోలేకపోవడం వంటివి సంభవిస్తాయి.

ఈ రెండు పరిస్థితులలోనూ థైరాయిడ్ గ్రంథి పెద్దదిగా మారవచ్చు. అయితే, హైపర్ థైరాయిడిజంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

థైరాయిడ్ వ్యాధి వెనుక కొన్ని కారణాలున్నాయి. మహిళలు ఈ వ్యాధితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి కుటుంబ చరిత్ర, అధిక అయోడిన్ కంటెంట్ ఉన్న మందులు, అయోడైజ్ చేయని ఉప్పు.. దీనితో పాటు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రక్తహీనత, టైప్-1 సెలియాక్ వ్యాధి, అడిసన్స్ వ్యాధి, లూపస్, ఆర్థరైటిస్, స్జోగ్రెన్స్ సిండ్రోమ్ కారణంగా కూడా ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.. అయితే.. ఇలాంటి లక్షణాలు వైద్యుడిని సంప్రదించి సకాలంలో పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..