AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lady Finger Benefits: బెండకాయ తింటున్నారా.. అయితే, ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెట్టినట్టే..!

బెండకాయ శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది వేసవిలో సమృద్ధిగా తినవచ్చు. కానీ బెండకాయ తయారీలో ఉపయోగించే మసాలాలు శరీరంలో వేడిని కలిగిస్తాయి.

Lady Finger Benefits: బెండకాయ తింటున్నారా.. అయితే, ఈ వ్యాధులన్నింటికీ చెక్‌ పెట్టినట్టే..!
Lady Finger
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2022 | 1:56 PM

Share

బెండకాయ.. ఎక్కువమంది ఇష్టపడే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. దీన్ని మన దేశంలో చాలా రకాలుగా వంటల్లో ఉపయోగిస్తారు. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బెండకాయలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఉన్నాయి. బెండకాయలో ఉండే పేక్టిన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఫోలేట్‌, విటమిన్ బి9 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మెదడు తన పనిని సరిగ్గా చేయడానికి చాలా సహాయకారిగా నిరూపిస్తాయి. బెండకాయ మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

నిజానికి బెండకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. బెండకాయలో ఉండే కరిగే ఫైబర్ పెక్టిన్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దాంతో గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటిక్ రోగులకు బెండకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి, ఫైబర్ పుష్కలంగా ఉన్న బెండకాయ జీర్ణవ్యవస్థలో చక్కెర శోషణ రేటును నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెండకయాలోని యాంటీ-డయాబెటిక్ లక్షణాలు కార్బోహైడ్రేట్‌లను జీవక్రియ చేసే ఎంజైమ్‌ల పరిమాణాన్ని తగ్గించడానికి మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి.

మీ బిడ్డ పదే పదే అనారోగ్యంతో ఉంటే, బెండకాయతో ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించండి. బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. 100 గ్రాముల బెండకాయలో విటమిన్ సి అవసరాలలో 38% అందిస్తుంది. ఇందులోని విటమిన్ B9, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇది గర్భిణీ స్త్రీలు వారి నవజాత శిశువులలో నాడీ సంబంధిత జన్మ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. గర్భిణీలు ఖచ్చితంగా వారానికి ఒకసారి బెండకాయ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బెండకాయలో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. ఇందులోని కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం ద్వారా కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. బెండకాయ శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది వేసవిలో సమృద్ధిగా తినవచ్చు. కానీ బెండకాయ తయారీలో ఉపయోగించే మసాలాలు శరీరంలో వేడిని కలిగిస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..