కాలిఫోర్నియాలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం కిడ్నాప్.. హత్య.. పంజాబ్‌లో తల్లిదండ్రులు, బంధువులు షాక్

అమెరికాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన ఎనిమిది నెలల చిన్నారి సహా నలుగురు భారత సంతతికి చెందిన కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురయ్యారు.

కాలిఫోర్నియాలో భారతీయ సంతతికి చెందిన కుటుంబం కిడ్నాప్.. హత్య.. పంజాబ్‌లో తల్లిదండ్రులు, బంధువులు షాక్
California Kidnap
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 06, 2022 | 12:18 PM

అమెరికాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన ఎనిమిది నెలల చిన్నారి సహా నలుగురు భారత సంతతికి చెందిన కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురయ్యారు. అమెరికాలో భారతీయ సంతతి కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కాలిఫోర్నియాలోని ఓ తోటలో శవమై కనిపించారని అక్కడి పోలీసులు ప్రకటించారు. హత్యకు గురైన కుటుంబ సభ్యులు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని హర్‌సిపింద్‌ గ్రామ నివాసితులు. 15 ఏళ్ల క్రితం వీరు అమెరికాకు వలస వెళ్లింది. ఈ క్రమంలోనే ఇటీవల కనిపించకుండా పోయిన వీరంతా దుండగుల చేతిలో హత్యకు గురైనట్టు తెలిసింది. హసియార్‌పూర్ తండా హర్సిపింద్ గ్రామానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అమెరికాలో అదృశ్యమయ్యారు. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలోని సౌత్ హైవే 59లోని 800 బ్లాక్ సమీపంలో వీరు కిడ్నాప్‌కు గురైనట్టు సమాచారం.

మృతుల్లో ఎనిమిది నెలల అరూహి ధేరి,ఆమె తల్లిదండ్రులు – 27 ఏళ్ల జస్లీన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్ గా గుర్తించారు. సోమవారం ఉత్తర కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుండి ఒక వ్యాపారం, ట్రక్కింగ్ కంపెనీలో కిడ్నాప్ చేయబడ్డారు. మెర్సిడ్ కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాప మేనమామ 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ కూడా కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇండియానా రోడ్ & హచిన్సన్ రోడ్ సమీపంలోని తోటలో బుధవారం సాయంత్రం నలుగురి మృతదేహాలు కనిపించాయని మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ వెర్న్ వార్న్కే తెలిపారు.

మృతిచెందిన కుటుంబం కిడ్నాప్‌కు గురైన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సీసీ ఫుటేజ్‌ని విడుదల చేశారు పోలీసులు. వీడియోలో జస్దీప్, అమన్‌దీప్ షాపింగ్‌ ముగించుకుని బయటకు వస్తున్నట్లు కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత, చిన్నారి,ఆమె తల్లి కిడ్నాపర్‌తో భవనం నుండి బయటకు రావడం చూడవచ్చు. సంఘటనా స్థలం నుండి బయలుదేరే ముందు కుటుంబంలోని నలుగురు సభ్యులను ట్రక్కులో ఎక్కించారు.

ఇవి కూడా చదవండి

కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఒక రోజు తర్వాత, పోలీసులు అనుమానిత కిడ్నాపర్ 48 ఏళ్ల జీసస్ మాన్యువల్ సల్గాడోను అదుపులోకి తీసుకున్నారు.అయితే, కిడ్నాపర్‌ సైతం ఆత్మహత్య ప్రయత్నం చేశాడని, ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని చెప్పారు. సల్గాడో కుటుంబం పోలీసులను సంప్రదించగా, అతను తన నేరాన్ని అంగీకరించినట్లు మెర్సిడ్ కౌంటీ పోలీసులు తెలిపారు.

మరోవైపు జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణధీర్ సింగ్, కిర్పాల్ కౌర్ హోషియార్‌పూర్ తాండా బ్లాక్‌లోని హర్సి పిండ్ గ్రామానికి చెందినవారు. తమ కొడుకు, కోడలు, చిన్నారి మనవరాలు మరణంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. నలుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి హత్యకు గురికావటంతో వారి గ్రామంలోనూ విషాదచాయలు అలుముకున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి