విశ్వాసం పేరుతో..అగ్నిలో నెయ్యి పోస్తూ.. మంటల్లో నడుస్తున్న భక్తజనం..ఎక్కడంటే..

ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే..ఈ విషయంలో పాలనా యంత్రాంగం కూడా చేతులు ముడుచుకు నిలబడాల్సిందే. అధికారులు,పరిపాలన యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తూ చూడాల్సిందే.

విశ్వాసం పేరుతో..అగ్నిలో నెయ్యి పోస్తూ.. మంటల్లో నడుస్తున్న భక్తజనం..ఎక్కడంటే..
Nalcha Mata Mandir
Follow us

|

Updated on: Oct 06, 2022 | 9:58 AM

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో చాలా మంది ప్రజలు విశ్వాసం పేరుతో తమ జీవితాలను రిస్క్‌లో పెడుతున్నారు.. అక్టోబర్ 5 విజయదశమి సందర్భంగా మందసౌర్‌లోని నల్చా మాత మందిర్ సమీపంలో వందలాది మంది ప్రజలు గుమిగూడారు. భక్తి,విశ్వాసం పేరుతో ప్రజలు మండుతున్న మంటలపై పరుగులు తీయడం కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు భక్తులు మంటల్లో నెయ్యి పోస్తున్నారు. మూఢనమ్మకాలతో కూడిన ఈ రేసులో, ప్రజలు ఇది తమ జీవితాలకు అగ్నిపరీక్షగా భావించి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా మధ్యప్రదేశ్ (ఎంపి)లోని మందసౌర్ జిల్లాలోని నల్చా మాత ఆలయ ప్రాంతం నుండి చుల్ నిర్వహిస్తారు. నిప్పుల మీద నడవటం వల్ల మనసులోని కోరికలు తీరుతాయని ప్రజల్లో గట్టి నమ్మకం.

మందసౌర్ జిల్లాలో, నల్చా మాత ఆలయ పరిధిలోని ఒక గొయ్యిలో కట్టెలు వేసి గొయ్యికి నిప్పంటించారు. కొంత సేపటి తర్వాత అందులో నెయ్యి పోస్తారు. దాంతో అక్కడ మంటలు మండుతూనే ఉంటాయి. ఆ తరువాత ఇక ఒకరి తర్వాత ఒకరు ఈ నిప్పులపై నడవటం మొదలుపెడతారు. అలా మంటల్లో నడిస్తే..ఆ దేవత తన కోరికలను తీరుస్తుందని స్థానికులు నమ్ముతారు.

మధ్యప్రదేశ్ (MP)లోని మందసౌర్ జిల్లాలో నల్చా మాత ఆలయం వద్ద ప్రమాదకరమైన అగ్ని గుండాల దాటుతున్నప్పుడు..కొంతమంది తడబడతారు. కానీ, అక్కడివారు నిప్పుల మీద నడవకుండా వారిని ఆపలేరు. అలాంటి సాహాసం కూడా ఎవరూ చేయరు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే..ఈ విషయంలో పాలనా యంత్రాంగం కూడా చేతులు ముడుచుకు నిలబడాల్సిందే. అధికారులు,పరిపాలన యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తూ చూడాల్సిందే. అగ్నిమాపక దళ బృందం ఇక్కడ కనిపించదు, భద్రతా చర్యలు లేవు. పోలీసు యంత్రాంగం ప్రజలకు అండగా నిలుస్తుందని గ్రామస్తులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Latest Articles