పులస సీజన్ పోయింది.. చీరమేను వచ్చేసింది.. 15 కేజీల చేప ఎంత ధర పలికిందే తెలిస్తే అవాక్కే

గోదావరి మత్య సంపదలో రారాజు చీరమేను అప్పుడే సందడి చేస్తోంది. యానాం గోదావరి తీర ప్రాంతంలో 15 kg ల చీరమేను ప్రత్యేక వలల ద్వారా చీరమేను చేపలను పట్టుకున్నారు మత్యకారులు.

పులస సీజన్ పోయింది.. చీరమేను వచ్చేసింది.. 15 కేజీల చేప ఎంత ధర పలికిందే తెలిస్తే అవాక్కే
Saurida Gracilis Fish
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2022 | 10:03 PM

ఉభయ గోదావరి జిల్లాలు ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి..ముఖ్యంగా ఇక్కడ దొరికే చేపలు, రొయ్యలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక పుస్తెలు తాకట్టు పెట్టైనా సరే, పులస తినాలనే నానుడి కూడా ఇక్కడ్నుంచి వచ్చింది. అదిరిపోయే రేటు పలికే పులస గోదావరి జిల్లాలోనే లభ్యమవుతుంది. ఇక ఆ పక్కనే వున్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇప్పుడు చీరమేను సందడి చేస్తోంది. గోదావరిలో లభించే అరుదైన మత్య్స సంపదలో చీరమేను ఒకటి. ఈ సారి కాస్త ముందుగానే వచ్చి ఊరిస్తుంది చీరమేను ..చూడ్డానికి చిన్నగా సన్నగా కనిపించే ఈ చేప రుచి అద్భుతం అంటారు భోజన ప్రియులు.

గోదావరి మత్య సంపదలో రారాజు చీరమేను అప్పుడే సందడి చేస్తోంది. యానాం గోదావరి తీర ప్రాంతంలో 15 kg ల చీరమేను ప్రత్యేక వలల ద్వారా చీరమేను చేపలను పట్టుకున్నారు మత్యకారులు. యానాం లో 15 kg ల చీరమేను ముపై నాలుగు వేలు (34,000)ధర పలికింది. 15 kg ల చీరమేను బకెట్ ను ఆకుల సత్యవతి అనే మత్యకార మహిళ వేలం పాటలో 30,000 వేలకు దక్కించుకుంది. మత్యకార మహిళ సత్యవతి వద్ద ఉన్న 15 kgల చీరమేను బకెట్ ను అమలాపురం కు చెందిన మాంస ప్రియుడు వాకపల్లి వెంకటేశ్వరరావు 34,000 వేలుకు కొనుగోలు చేసాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో సంవత్సరానికు ఒక్కసారి మాత్రమే దొరికే అరుదైన చిన్న చేప చీరమేను.

బైరవపాలెం,యానాం,ఎదురులంక, పిల్లంక,కోటిపల్లి గోదావరి తీర ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది చీరమేను. దీపావళి తరువాత వచ్చే చీరమేను ముందుగా రావడంతో చీరమేను తినడానికి లొట్టలు వేస్తున్నారు మాంస ప్రియులు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు చీరమేను పులుసు, ఇగురు పెట్టుకుని తింటారు. పలుచటి చీరతో సేకరించడం వల్ల వీటికి చీరమేను చేపలనే పేరు వచ్చింది. సుమారు మూడు నెలల పాటు ఇవి దొరుకుతాయని మత్య్సకారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి