దసరా వేడుకలో అపశృతి.. ఉయ్యాల విరిగిపడి పలువురి గాయాలు.. వైరలవుతున్న వీడియో
అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు పరుగులు తీశారు. దాంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. అతి వేగంతో సర్కిల్‌ల్లో కదులుతున్న స్వింగ్ అకస్మాత్తుగా హుక్ నుండి ఎలా విడిపోయిందో వీడియో క్యాప్చర్ చేసింది.
దసరా ఉత్సవాల్లో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. దసరా వేడుకల నేపథ్యంలో ఏర్పాటు చేసిన రామ్‌లీలా ఫెయిర్‌లో ఉయ్యాల విరిగిపడిపోయింది.. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా గంట స్తంభం వద్ద ఉన్న మైదానంలో వినోద మేళా ఏర్పాటు చేశారు. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం పరిధిలోని ప్రజలు జాతరను సందర్శిస్తున్నారు. అయితే శుక్రవారం ఇక్కడ దురదృష్టకర సంఘటన జరిగింది.
సుమారు 10 మంది వ్యక్తులు బ్రేక్-డ్యాన్స్ స్వింగ్‌ను నడుపుతుండగా, అకస్మాత్తుగా కార్లలో ఒకటి పైవట్ నుండి తప్పిపోయింది. దాంతో ఒక్కసారిగా అది పక్కకు పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. జనాలు భయాందోళనకు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు పరుగులు తీశారు. దాంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. అతి వేగంతో సర్కిల్‌ల్లో కదులుతున్న స్వింగ్ అకస్మాత్తుగా హుక్ నుండి ఎలా విడిపోయిందో వీడియో క్యాప్చర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Ghaziabad – A major accident happened in Ramlila Ghantaghar, 4 people of the same family were injured when the swing broke at Ramlila Maidan in Ghaziabad.#Ghaziabad #Accident pic.twitter.com/B8acCFAPsC
— Prateek Pratap Singh (@PrateekPratap5) October 1, 2022
ఈ నేపథ్యంలో మేళాలో ఏర్పాటు చేసిన తిరిగే రాట్నాలు, ఉయ్యాలను పోలీసులు మూసివేశారు. ఘజియాబాద్ పురపాలక అధికారులు ఈ ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్‌లో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..