CM Yogi: జూలో చిరుత పిల్లకు పాలు తాగించిన సీఎం యోగి.. వైరలవుతున్న వీడియో
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక చిరుతపులి పిల్లకు పాలు పట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జంతుప్రదర్శనశాలను సందర్శించారు. అప్పుడు యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఒక చిరుతపులి పిల్లకు పాలు పట్టించారు. దీనికి సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ అధికారిక యూట్యూబ్ పేజీలో షేర్ చేసింది. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు.
ఈ క్రమంలోనే సీఎం యోగి ఒక చిరుత పిల్లకు పాలబాటిల్‌తో పాలు పట్టించేందుకు దాని ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి యోగికి ఇచ్చారు. ఐతే అది మొదట పాలు తాగేందుకు అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆయన వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎట్టకేలకు ఆ చిరుత పిల్లకు పాలు పట్టించగలిగారు. అంతేకాదు.. ఆ జూలో ఉన్న మిగతా పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.
చిరుత పిల్లకు పాలు తాగించిన సీఎం యోగి:
ఈ జూని షాహిద్ ఆష్పాక్ ఉల్లాల్ ఖాన్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది పుర్వాంచల్ ప్రాంతంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్. దీన్ని గతేడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లో మూడవది అని జూ అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం