అత్యాచారం కేసును రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు.. షరతులతో కూడిన భిన్నమైన తీర్పు..తెలిస్తే అవాక్కే!

అతడు రోజుల వ్యవధిలోనే నగదు మొత్తాన్ని అత్యాచార బాధితురాలికి చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు, తీర్పుతో పాటుగా కోర్టు అతడికి ఓ భిన్నమైన కండీషన్‌ కూడా పెట్టింది.

అత్యాచారం కేసును రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు.. షరతులతో కూడిన భిన్నమైన తీర్పు..తెలిస్తే అవాక్కే!
Delhi High Court
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 06, 2022 | 12:41 PM

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిపై నమోదైన అత్యాచారం కేసును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు అతనికి నాలుగున్నర లక్షల జరిమానా విధించింది. అతడు రోజుల వ్యవధిలోనే నగదు మొత్తాన్ని అత్యాచార బాధితురాలికి చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు, తీర్పుతో పాటుగా కోర్టు అతడికి ఓ భిన్నమైన కండీషన్‌ కూడా పెట్టింది. అది తెలిసిన ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్యపై లైంగిక వేధింపులు, అక్రమ వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ జరగగా ఈ మేరకు కోర్టులో తీర్పు వెలువడింది. అందులో నిందితుడు, బాధిత మహిళ భార్యాభర్తలని తేలిసింది. అయితే, మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారని పేర్కొంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. వివాహ సంబంధ వివాదం కారణంగానే ఈ కేసు తలెత్తిందని కోర్టు పేర్కొంది.

అయితే, ఇంతకుముందు ఈ సమస్యపై తాము హృదయపూర్వకంగా శాంతికి వెళ్తున్నామని ఇరుపక్షాలు ప్రకటించాయి. అలాగే, కేసు కొట్టివేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ భార్య హామీ ఇచ్చింది. దీంతో కోర్టు కేసును కొట్టివేయడమే కాకుండా తీర్పులో కొన్ని షరతులు విధించారు. అదేంటంటే, ఈ కేసు 2020 నుంచి నడుస్తోంది. ఈ కేసు కోర్టు సమయాన్ని, పోలీసుల సమయాన్ని వృధా చేసిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు శిక్షగా పిటిషనర్ సమాజానికి ఏదైనా మేలు చేయాలని కోర్టు తీర్పులో వెల్లడించింది. ఈ క్రమంలో అతడికి ఓ భిన్నమైన షరతు పెట్టింది కోర్టు.

ఢిల్లీలోని నోయిడాలో రెండు బర్గర్ షాపులను నడుపుతున్నాడు నిందితుడు. అందువల్ల రెండు అనాథాశ్రమాలకు కనీసం 100 మందికి రుచికరమైన,పరిశ్రుభమైన బర్గర్‌లను అందించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అంతే కాకుండా అతని మాజీ భార్య రూ. 4.5 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది కోర్టు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..