వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న భార్య భర్తలు

వాగులో వరద ఉధృతిని అంచనా వేయలేకపోయిన శివ వాగును దాటించేందుకు కారును ముందుకు పోనిచ్చాడు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగు మధ్యలో కారు ఆగిపోయింది.

వాగులో చిక్కుకున్న కారు.. చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న భార్య భర్తలు
Flood Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 06, 2022 | 11:55 AM

వర్షాకాలం సీజన్‌ పూర్తైంది. అయినప్పటికీ తగ్గేదేలే.. అన్నట్టుగా వరుణుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. కుండపోత వర్షాలతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. తెలంగాణ అంతటా అక్టోబర్‌ 5న కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వికారాబాద్‌ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తు్న్న వాగులతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుప్రాంతాల్లలో వాగులు, వంకల్లో వరద పోటెత్తింది. భారీ వర్షం కారణంగా నాగారం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. జిల్లాలోని థరూర్ మండలం నాగారం వద్ద వరద ఉధృతికి వాగులో కారు చిక్కుకుంది. కారులోని ప్రయాణీకులు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.

దారూర్ మండలం నాగారం గ్రామం వద్ద వాగులో శివ, లాస్య అనే దంపతులు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. దాంతో అదృష్టవశాత్తు ఆ భార్యభర్తలిద్దరూ చెట్టు కొమ్మను పట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. పండుగ ముగించుకుని వికారాబాద్ వెలదామని భార్య భర్తలు శివ లాస్య బయలు దేరే సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు వాగులో చిక్కుకుపోయింది. అయితే వాగులో వరద ఉధృతిని అంచనా వేయలేకపోయిన శివ వాగును దాటించేందుకు కారును ముందుకు పోనిచ్చాడు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగు మధ్యలో కారు ఆగిపోయింది. వాగు ఉధృతికి కారు ఒకవైపు ఒరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలిద్దరూ కారు దిగి పక్కనే ఉన్న చెట్టు పైకి ఎక్కేసి నిలబడ్డారు. చెట్టు కొమ్మలు పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో అవతలి ఒడ్డుకు చేరుకున్నారు.

చెట్టు పైకెక్కి ప్రాణాలు దక్కించుకున్న భార్య భర్తలు

ఇదిలా ఉంటే, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిక జారీ చేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి