కాల్చిన శెనగలు తింటే బోలేడన్ని ప్రయోజనాలు.. ఈ సమస్యలు మాటుమాయం.. ఏంటో తెలుసుకోండి..
శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి.
శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి.. ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలుంటాయి. కేవలం పచ్చి శనగలు మాత్రమే కాకుండా.. కాల్చిన శనగలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కాల్చిన శనగలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో సులభంగా బరువు తగ్గుతారు. అలాగే ఇందులో ఫైబర్, ప్రోటిన్స్ అధికం. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తేమ, లుబ్రికెంట్స్, ఫైబర్స్, కాల్షియం, ఐరన్, అనేక విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.
కాల్చిన శనగలు తింటే రక్తంలో చక్కెర నియంత్రణ.. మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కాల్చిన శనగలను తీసుకోవడం ఉత్తమం. ఇది రక్తంలో చక్కరను పెంచదు. అలాగే ఇందులో పీచు పదార్థం ఉండడం వలన జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే కాల్చిన శనగలు పురుషులు తింటే అలసట, నీరసం తగ్గుతుంది.వీరు ఉదయం అల్పాహారంగా ఒక గ్లాసు పాలతో కాల్చిన శనగపిండిని తీసుకోవడం వలన బలహీనత తగ్గుతుంది. వీటిని బెల్లంతో కలిపి తింటే రక్త లోపం నియంత్రించవచ్చు.
Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..