Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..

టాలెంటెడ్ హీరో కమల్ హాసన్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు కరోనా లక్షణాలు

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..
Kamal Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 25, 2021 | 8:21 AM

టాలెంటెడ్ హీరో కమల్ హాసన్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కమల్‏కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం కమల్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ క్వారంటైన్‏లో ఉన్నట్లుగా ఆయన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కమల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా.. కమల్ ఆరోగ్య పరిస్థితి పై ఆయన కూతురు శ్రుతి హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“నా తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం తను కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. కమల్ కోవిడ్ భారిన పడడంతో ఆయన చేస్తున్న సినిమాలు.. షో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కమల్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ చేస్తున్నాడు. అలాగే బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోకు ఇప్పుడు ఎవరు వ్యాఖ్యతగా నిర్వహించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కమల్ స్థానంలో హోస్ట్ బాధ్యతలను శృతి హాసన్ చేపట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Also Read: Drishyam 2 Twitter Review: దృశ్యం 2 ట్విట్టర్ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో అదిరిపోయిందంటున్న నెటిజన్స్..

Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..

Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్‏బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..

Aamir Khan: కేజీఎఫ్ 2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన ఆమిర్‌ ఖాన్‌.. ఎందుకంటే..