AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..

Dance Choreographer: ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..
Shiva Shankar Master
Shiva Prajapati
|

Updated on: Nov 24, 2021 | 11:22 PM

Share

Dance Choreographer: ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కరోనా సోకడంతో గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరీక్షించగా.. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకగా.. ఆయనకు కూడా సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఇక శివ శంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకగా.. ఆమెకు హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. కాగా, శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోందని ఆయన చిన్న కొడుకు అజయ్ తెలిపారు. రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోన్నట్లు సమాచారం. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిపై వస్తున్న వార్తలు ఆయన అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Also read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..