AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam 2 Twitter Review: దృశ్యం 2 ట్విట్టర్ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో అదిరిపోయిందంటున్న నెటిజన్స్..

హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం దృశ్యం 2. మీనా, ఈస్తర్ అనిల్, కృతిక, నరేష్, నదియా, సంపత్ రాజ్, పూర్ణ

Drishyam 2 Twitter Review:  దృశ్యం 2 ట్విట్టర్ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో అదిరిపోయిందంటున్న నెటిజన్స్..
Drishyam 2
Rajitha Chanti
|

Updated on: Nov 25, 2021 | 8:02 AM

Share

హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం దృశ్యం 2. మీనా, ఈస్తర్ అనిల్, కృతిక, నరేష్, నదియా, సంపత్ రాజ్, పూర్ణ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్థరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ దృశ్యం 2 మరింత ఆసక్తిని కలిగించిన సంగతి తెలిసిందే. గతంలో వెంకీ ప్రధాన పాత్రలో వచ్చినా దృశ్యం సినిమాకు సిక్వెల్ ఈ చిత్రం. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు నెటిజన్స్. దృశ్యం సినిమాను దృశ్యం 2 మూవీ మించిపోయిందని.. మరోసారి వెంకీ అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అలాగే స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, మ్యూజిక్ సూపర్ ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. దృశ్యం 2 మూవీ ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎక్స్‏పీరియన్స్ అందించాయని తెలిపారు. అలాగే డైరెక్టర్ జీతు జొసెఫ్ తెరకెక్కించిన విధానానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాంబాబు సినిమా థియేటర్ కట్టుకుని హాయిగా జీవిస్తుండగా.. మళ్లీ వరుణ్ హత్యకు సంబంధించిన అంశాలను పోలీసులు మరోసారి తెరపైకి తీసుకురావడంతో రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఎంతో అద్భుతంగా చూపించారు డైరెక్టర్. మొత్తానికి దృశ్యం సినిమా మించిన ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది దృశ్యం 2.

Also Read: Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్‏బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..

Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..