AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్‏బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుతోంది. ఇక బిగ్‏బాస్ ఇంటి చివరి కెప్టెన్‏గా షణ్ముఖ్ ఎన్నికయ్యాడు. అయితే కెప్టెన్సీ కంటెండర్

Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్‏బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Nov 25, 2021 | 6:59 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుతోంది. ఇక బిగ్‏బాస్ ఇంటి చివరి కెప్టెన్‏గా షణ్ముఖ్ ఎన్నికయ్యాడు. అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నియంత మాటే శాసనం గేమ్‏లో రవి.. షణ్ముఖ్, ప్రియాంక మిగలిగా.. షణ్ముఖ్ సింహాసనాన్ని దక్కించుకున్నాడు. దీంతో ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా ప్రియాంక చెప్పడంతో కాజల్ కూడా ఆమెకు మద్దతు పలికింది. దీంతో కమ్యూనిటీ అన్న పదం రాకూడదని సీరియస్ అయ్యాడు షణ్ముఖ్. ఇక రవిని సేవ్ చేసి.. ప్రియాంకను ఎలిమినేట్ చేశాడు షణ్ముఖ్. దీంతో ప్రియాంక వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక షణ్ముఖ్, రవిలో ఎక్కువ ఓట్లు షన్నూకు రావడంతో అతను కెప్టెన్ అయ్యాడు.

ఇక లగ్జరీ బడ్జెట్ టాస్కులో రైలు గేమ్ ఆడించాడు బిగ్‏బాస్. చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్స్ బోగీలా మారడంతోపాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఇక ఈ గేమ్ ఫన్నీగా సాగింది. ఇక ఇంటి సభ్యులందరిని పాజ్ చేసి.. కాజల్ భర్త.. కూతురును ఇంటిలోపలికి పంపించాడు బిగ్‏బాస్. తల్లిని చూడగానే కాజల్ కూతురు ఎమోషనల్ అయ్యింది. ఇక కాజల్ ను రిలీజ్ చేయగానే కూతురును పట్టుకుని ఏడ్చేసింది. ఇక మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే కోపం వస్తాదా అని శ్రీరామ్ అడగ్గా.. అవునంటూ తలుపింది కాజల్ కూతురు. ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. ఇక ఈరోజు ప్రోమోలో.. ముందుగా శ్రీరామ్ కోసం వాళ్ల సిస్టర్ రాగా.. మానస్ కోసం తన తల్లి వచ్చింది.

Also Read: Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..

Shivani Rajashekar : ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మా శివాని ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..

ai Dharam Tej : మీతో కలిసి సినిమా చూడటం కుదరలేదు.. సాయి ధరమ్ తేజ్ ఆడియో మెసేజ్..